బ్రెజిల్‌ ప్రయాణాలపై నిషేధం‌: ట్రంప్‌

20 May, 2020 08:30 IST|Sakshi

వాషింగ్టన్‌: మహమ్మారి కరోనా వైరస్‌(కోవిడ్‌-19) వ్యాపిస్తున్న నేపథ్యంలో బ్రెజిల్‌ నుంచి ప్రయాణికులపై నిషేధం విధించాలనే యోచనలో​ ఉన్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్ తెలిపారు. అక్కడి నుంచి వచ్చే వాళ్లను దేశంలోకి అనుమతించి తమ పౌరులను ప్రమాదంలోకి నెట్టలేమన్నారు. శ్వేతసౌధంలో మంగళవారం విలేకరులతో మాట్లాడిన ట్రంప్‌..‘‘బ్రెజిల్‌లో  కొన్ని సమస్యలు ఉన్నాయి. అందులో ఎటువంటి సందేహం లేదు. మేం వెంటిలేటర్లు పంపండం ద్వారా వారికి సహాయపడుతున్నాం. అయితే బ్రెజిల్‌ నుంచి వచ్చే వాళ్లను అనుమతించడం.. వాళ్ల ద్వారా మా ప్రజలకు ఇన్‌ఫెక్షన్‌ సోకడం నాకు ఇష్టం లేదు’’అని పేర్కొన్నారు. కాబట్టి బ్రెజిల్‌పై ట్రావెల్‌ బ్యాన్‌ విధించాలనుకుంటున్నట్లు తెలిపారు. (డబ్ల్యూహెచ్‌ఓ నుంచి వైదొలగుతాం)

కాగా లాటిన్‌ అమెరికా దేశం బ్రెజిల్‌లో ఇప్పటి వరకు దాదాపు 2,54,220 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో ప్రపంచంలో అత్యధిక పాజిటివ్‌ కేసులు నమోదైన దేశాల జాబితాలో బ్రెజిల్‌ మూడో స్థానంలో నిలిచింది. ఇప్పటి వరకు అక్కడ కరోనాతో 16,792 మంది మరణించినట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఇదిలా ఉండగా.. అమెరికాలో దాదాపు పదకొండున్నర లక్షల మంది వైరస్‌ బారిన పడగా... సుమారు 92 వేల మంది మృత్యువాతపడ్డారు. (ఆ డ్రగ్‌ వాడుతున్నా.. అవన్నీ వట్టి మాటలే: ట్రంప్‌)

మరిన్ని వార్తలు