'అదంతే.. నేనసలే చాలా వైలెంట్'

13 Mar, 2016 11:55 IST|Sakshi
'అదంతే.. నేనసలే చాలా వైలెంట్'

న్యూయార్క్‌: తనకు హానీ కలిగించాలని ప్రయత్నించిన వ్యక్తి బహుషా ఇస్లామిక్ స్టేట్ మద్దతుదారు అయి ఉండొచ్చని డొనాల్డ్ ట్రంప్ అన్నాడు. అందుకే అతడు అలా చేసి ఉండొచ్చని అన్నాడు. డేటన్లో ట్రంప్ ప్రచార సభలో మాట్లాడుతుండగా ఓ వ్యక్తి బారికేడ్లను దాటుకొని వేగంగా అతడివైపు దూసుకొని వచ్చాడు. ట్రంప్ పై దాడి చేసేందుకు ప్రయత్నించాడు. ఇది చూసి వెంటనే స్పందించిన సిబ్బంది అతడిని అడ్డుకున్నారు. అక్కడి నుంచి తీసుకెళ్లారు.

'అతడిని జైలులో పెట్టాలి. అతడికి దేశంపట్ల ప్రేమలేదు. ఇస్లామిక్ స్టేట్ మద్దతుదారు అయ్యి ఉండొచ్చు. మన న్యాయస్థానాలు కఠినమైనవి, తెలివైనవి. అంత తేలికగా అతడ్ని వదలవని అనుకుంటున్నాను. నేను ఎందుకు ఉగ్రవాదం విషయంలో కఠినంగా ఉన్నానంటే నేనసలే చాలా వాయిలెంట్' అని ట్రంప్ అన్నాడు. ఇప్పటికే ట్రంప్ పట్ల కొన్ని ప్రాంతాల్లో వ్యతిరేకత వస్తున్న విషయం తెలిసిందే. ఇదివరకే మద్దతుదారులు, వ్యతిరేకుల మధ్య ఘర్షణ వల్ల  డోనాల్డ్ ట్రంప్ తన షికాగో ప్రచార ర్యాలీని రద్దు చేసుకోగా ఇది మరో ఘటన.

మరిన్ని వార్తలు