ఆమె బాగుండాలని కోరుకుంటున్నా: ట్రంప్‌

22 Jul, 2020 10:44 IST|Sakshi

వాషింగ్టన్‌: వ్యాపారీ జెఫ్రీ ఎప్‌స్టీన్ కోసం మైనర్‌ బాలికల విక్రయానికి పాల్పడిన ఆరోపణలపై గిస్లైన్ మాక్స్వెల్‌ అరెస్ట్‌ అయ్యారు. ఆ కేసుకు సంబంధించి విషయాన్ని పరిశీలించలేదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ అన్నారు. కానీ, గిస్లైన్‌ మాక్స్‌ బాగుండాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. ఆయన మంగళవారం కరోనా వైరస్‌ గురించి మాట్లాడుతూ.. జెఫ్రీ ఎప్‌స్టీన్‌ కేసులో ఎవరు దోషులుగా తేలుతారని విలేకరులు ప్రశ్నించగా.. ఆ కేసు గురించి తనకు ఏమాత్రం తెలియదన్నారు. ఆ కేసును తాను పరిశీలించడం లేదన్నారు. కానీ, తాను పామ్‌ బీచ్‌ ప్రాంతంలో నివాసం ఉన్నప్పటి నుంచి గిస్లైన్‌ మాక్స్‌వెల్‌ కూడా అదే బీచ్‌ సమీపంలో నివాసం ఉన్నట్లు తెలుసన్నారు. (వీసా నియంత్రణలపై దావా!)

ఇక తాను గిస్లైన్ మాక్స్వెల్‌ను పలుసార్లు కలిసినట్లు ట్రంప్‌ పేర్కొన్నారు. బ్రిటన్‌ యువరాజు ఆండ్రూ, మాక్స్‌కు  ఉన్న సంబంధాల గురించి తనకు తెలియదన్నారు. గతవారం న్యూయార్క్‌ న్యాయస్థానంలో జరిగిన విచారణలో జెఫ్రీ ఎప్‌స్టీన్ నేరాలతో తనకు ఎటువంటి సంబంధం లేదని మాక్స్‌వెల్‌ తెలిపారు. జెఫ్రీ 14ఏళ్ల బాలికలను లైంగికంగా వేధించాడని న్యాయవాదులు ఆరోపించారు. ఈ కేసులో ఆమెకు న్యాయస్థానం బెయిల్‌ నిరాకరించింది. అదే విధంగా ఎప్‌స్టీన్ ఆస్తుల దుర్వినియోగం విషయంలో కూడా మాక్స్‌వెల్‌పై ఆరోపణలు ఉన్న విషయం తెలిసిందే. జెఫ్రీ ఎప్‌స్టీన్‌(66) జైలులోనే ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ఎప్‌స్టీన్‌ గతంలో ప్రస్తుత అధ్యక్షుడు ట్రంప్, మాజీ అధ్యక్షుడు క్లింటన్, బ్రిటన్‌ యువరాజు ఆండ్రూ వంటి పలువురు రాజకీయనేతలు, సెలబ్రిటీలతో సన్నిహిత సంబంధాలు సాగించేవాడనే ఆరోపణలు ఉన్నాయి. (అది తెలిస్తే అందరూ ఆశ్చర్యపోతారు: మేరీ ట్రంప్‌)

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు