మేయర్‌ అరెస్ట్‌కు డిమాండ్‌.. నవ్వులపాలు

14 Jan, 2018 12:20 IST|Sakshi

లండన్‌ : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌కు ఇతర దేశాల్లోనూ అభిమానుల సంఖ్య తక్కువేం కాదు. ఇంగ్లాండ్‌లో ఆ సంఖ్యకు కొదవేం లేదు. అయితే తాజాగా లండన్‌లో ట్రంప్‌ వీరాభిమానులని చెప్పుకొనే కొందరు చేపట్టిన ఓ నిరసన ప్రదర్శన ఘోరంగా విఫలం అయ్యింది. ట్రంప్‌కు వ్యతిరేకంగా గళం విప్పుతున్న మేయర్‌ సాధిక్‌ ఖాన్‌ అరెస్ట్‌ను డిమాండ్‌ చేసి నవ్వులపాలయ్యారు. 

శనివారం సెంట్రల్‌ లండన్‌లో నిర్వహించిన ఓ కార్యక్రమంలో మేయర్‌ సాధిక్‌ ప్రసంగించారు. ఆ సమయంలో అక్కడే ఉన్న ట్రంప్‌ మద్ధతుదారులు ఒక్కసారిగా నినాదాలు చేయటం ప్రారంభించారు. ఈయూకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఓ వ్యక్తి అమెరికా జెండాను ప్రదర్శించాడు. నిరసనకు స్పష్టమైన కారణం వెల్లడించనప్పటికీ.. సాధిక్‌ ఖాన్‌కు మేయర్‌గా కొనసాగే అర్హత లేదని వారంతా సభలో గోల చేశారు. ట్రంప్‌కు వ్యతిరేకంగా మాట్లాడుతున్న ఆయన్ని అరెస్ట్‌ చేయాల్సిందేనని పట్టుబట్టారు. ఈ పరిణామాలతో మేయర్‌ ప్రసంగానికి కాసేపు ఆటంకం ఎదురైంది. 

10 నిమిషాల తర్వాత అక్కడికి చేరుకున్న పోలీసులు వారిని బలవంతంగా బయటకు లాక్కెల్లారు. అనంతరం ప్రసంగించిన సాధిక్‌.. ‘‘మేధావుల మూలంగా స్పీచ్‌కు కాసేపు అంతరాయం కలిగిందని.. అందుకు ప్రజలు క్షమించాలి’’ అని పేర్కొనటంతో అక్కడ ఉన్న ప్రజలు గొల్లుమని నవ్వుకున్నారు. ఆపై తన ప్రసంగాన్ని ఆయన కొనసాగించారు. అర్థం పర్థం లేని డిమాండ్‌తో పరువు తీసుకోవటం తప్పించి వారు సాధించింది ఏం లేదని కార్యక్రమం ముగిశాక కొందరు మీడియాతో వ్యాఖ్యానించారు. 
  
పాకిస్తానీ డ్రైవర్‌ కొడుకైన సాధిక్‌ ఖాన్‌ లండన్‌కు మెట్టమెదటి ముస్లిం మేయర్‌. ముస్లిం దేశాలపై ట్రంప్‌ చేస్తున్న వ్యాఖ్యలను.. విధిస్తున్న ఆంక్షలను.. నిర్ణయాలను సాధిక్‌ ఖండిస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ట్రంప్‌ అభిమానులు ఇలా స్పందించారన్న మాట.

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

ఉపాధి వేటలో విజేత

బహ్రెయిన్‌లో 26న ఓపెన్‌ హౌస్‌

‘నేను డయానాను.. నాకిది పునర్జన్మ’

లండన్‌ సురక్షిత నగరమేనా?

యానిమేషన్‌ స్టూడియోకు నిప్పు

హెచ్‌1బీ ఫీజుతో అమెరికన్లకు శిక్షణ

దారుణం: 24 మంది సజీవ దహనం

మీరు అసలు మనుషులేనా..ఇంతలా హింసిస్తారా?

రెండు కళ్లలోకి బుల్లెట్లు దూసుకుపోయి..

అవినీతి కేసులో పాక్‌ మాజీ ప్రధాని అరెస్ట్‌

ఇంతకు ‘తను’ తండ్రా, తల్లా?!

నీకు నోబెల్‌ వచ్చిందా? గొప్ప విషయమే!

ఆ ఏడాది దాదాపు 2000 రేప్‌లు...!

32నామినేషన్లు కొల్లగొట్టిన 'గేమ్‌ ఆఫ్‌ థ్రోన్స్‌'

తొలిసారి ఎయిర్‌పోర్ట్‌కొచ్చి.. ఆగమాగం!

ఒక్కసారి బ్యాటింగ్‌ మొదలుపెడితే..

ఉగ్ర సయీద్‌ అరెస్ట్‌

ప్రతిభ వలసల వీసాలు 57 శాతం

ఉరి.. సరి కాదు

అంతరిక్ష పంట.. అదిరెనంట!

సోషల్‌ మీడియాతో చిన్నారుల్లో మానసిక రుగ్మతలు

అంతర్జాతీయ కోర్టులో భారత్‌కు విజయం

నాడు చంద్రుడి యాత్ర విఫలమైతే..

అంతుచిక్కని రోగం: ముఖం భయంకరంగా..

గ్లోబల్‌ టెర్రరిస్ట్‌ హఫీజ్‌ సయీద్‌ అరెస్ట్‌

నిర్లవణీకరణకు కొత్త మార్గం!

భారత్‌కు దావూద్‌ కీలక అనుచరుడు!

ఇదో ఘనకార్యమైనట్టు.. ఇలా ఫొటో దిగారు!!

40 కేజీల లగేజీ తీసుకెళ్లొచ్చు!

పోయిందే.. ఇట్స్‌గాన్‌..

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

‘సాహో’ విడుదల ఎప్పుడంటే..?

ఘోర రోడ్డు ప్రమాదం : బాలనటుడు దుర్మరణం 

గర్భంతో ఉన్న చిత్రాలను విడుదల చేసిన శ్రుతి

నాన్నకు ప్రేమతో మిస్సయ్యాను

ఎక్కడైనా ఒకేలా ఉంటా

అడ్డంకులు మాయం!