మరోసారి చైనాపై ఆగ్రహం ప్రదర్శించిన ట్రంప్‌

15 Jul, 2020 10:22 IST|Sakshi

వాషింగ్టన్‌: కరోనా వైరస్‌ విషయంలో చైనా మీద ఆగ్రహం వ్యక్తం చేస్తోన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్ తాజాగా మరోసారి తన కోపాన్ని ప్రదర్శించారు. చైనాతో మాట్లాడే ఆలోచన తనకు లేదన్నారు. ఈ సందర్భంగా ట్రంప్‌ మాట్లాడుతూ.. ‘లేదు.. నేను అతనితో(జిన్‌పింగ్‌) మాట్లాడను. వారితో మాట్లాడే ఆలోచన కూడా నాకు లేదు. కరోనా వైరస్‌ను కట్టడి చేయడంలో వారు విఫలమయ్యారు. చైనాతో గొప్ప వాణిజ్య ఒప్పందం కుదుర్చుకున్నాం. జనవరిలోనే ఫేస్‌1 అగ్రీమెంట్‌పై సంతకాలు కూడా అయ్యాయి. సిరా ఇంకా ఆరకముందే వారు మమ్మల్ని కరోనా వైరస్‌తో దెబ్బ తీయాలని చూశారు. అందుకే మరో తప్పు చేయకూడదు అనుకుంటున్నాను. వారు వైరస్‌ గురించి దాచి పెట‍్టారు.. ప్రపంచం మీదకు వదిలారు. కరోనా వల్ల ప్రపంచానికి కలిగిన నష్టానికి చైనానే బాధ్యత వహించాలి’ అన్నారు. అంతేకాక ప్రపంచ ఆరోగ్య సంస్థ మీద కూడా ట్రంప్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. డబ్ల్యూహెచ్‌ఓ చైనా తోలుబొమ్మ అన్నారు.(చైనాపై కఠిన చర్యలకు సిద్ధమైన అమెరికా!

అంతేకాక ‘మా ప్రభుత్వం చాలా ముందుగానే చైనా, యూరోప్‌ నుంచి ప్రయాణాలను బ్యాన్‌ చేసి చాలా మంచి నిర్ణయం తీసుకుంది. ఇలా చేసి మేం చాలామంది ప్రాణాలు కాపాడం. ప్రజలంతా ఒక విషయం గమనించాలి.. చైనాపై పొరాడటానికి, కరోనా నుంచి ప్రజలను కాపాడటానికి మేం సమాఖ్య ప్రభుత్వ పూర్తి శక్తిని ఉపయోగిస్తున్నాం’ అన్నారు. అతి త్వరలోనే కరోనా వైరస్‌కు వ్యాక్సిన్‌ను కూడా తీసుకొస్తామని ట్రంప్‌ తెలిపారు. అదే విధంగా డెమొక్రటిక్‌ అభ్యర్థి జో బిడెన్‌పై కూడా ట్రంప్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘చైనా మన ప్రత్యర్థి అనే ఆలోచన వింతైనదని ఆయన అన్నారు. అతను  చైనా అసలు ప్రాబ్లమ్‌ కాదు అన్నారు. గత 25, 30 ఏళ్ల నుంచి చైనా ఇబ్బంది పెట్టినంతగా ఎవరు మనల్ని ఇబ్బంది పెట్టలేదు. చైనా పట్ల కఠినంగా ఉండాల్సిన సమయంలో ఆయన దానికి వ్యతిరేకంగా ఒక్క మాట మాట్లాడటం లేదు’ అని ఆరోపించారు.(శ్మశానాల్లో రాబందులు)

మరిన్ని వార్తలు