గాడిద‌పై ఎఫ్ఐఆర్; స్టేష‌న్‌కు త‌ర‌లింపు

9 Jun, 2020 20:15 IST|Sakshi

క‌రాచీ: జూదం రేసులో పాల్గొందంటూ పాకిస్తాన్ పోలీసులు ఓ గాడిద‌ను అరెస్ట్ చేశారు. ఈ వింత ఘ‌ట‌న పంజాబ్ ప్రావిన్స్‌లోని యార్ ఖాన్‌ న‌గ‌రంలో చోటు చేసుకుంది. జూదం ఆడుతున్నార‌న్న ప‌క్కా స‌మాచారంతో యార్ ఖాన్‌కు చేరుకున్న పోలీసులు 8 మందిని అరెస్టు చేశారు. ఇక నిందితుల ద‌గ్గ‌ర నుంచి ల‌క్షా 20 వేల రూపాయ‌ల‌ బెట్టింగ్ సొమ్మును స్వాధీనం చేసుకున్నారు. సంఘ‌ట‌నా స్థ‌లంలో ఓ గాడిద కూడా ఉండ‌టంతో దాన్ని అరెస్టు చేసి పోలీస్ స్టేష‌న్‌కు తీసుకెళ్లారు. ('నాకు 30 సెకన్లు పట్టింది.. మరి మీకు')

ఎఫ్ఐఆర్‌లో గాడిద పేరు కూడా ఉండ‌టంతోనే దాన్ని అరెస్టు చేశామ‌ని పోలీసులు వివ‌ర‌ణ ఇచ్చారు. ప్ర‌స్తుతం దాన్ని స్టేష‌ను ఆవ‌ర‌ణ‌లో క‌ట్టేసిన‌ట్లు పేర్కొన్నారు. నైలా ఇనాయ‌త్ అనే జ‌ర్న‌లిస్టు ఈ ఘ‌ట‌న తాలూకు వీడియోను సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేయ‌గా ప్ర‌స్తుతం వైర‌ల్‌గా మారింది. గాడిదను అరెస్టు చేయ‌డంపై నెటిజ‌న్లు ఛ‌లోక్తులు విసు‌రుతున్నారు‌. (ఆ గాడిద నాదే.. కాదు నాదే!)

మరిన్ని వార్తలు