'ప్లీజ్.. మా విషయంలో జోక్యం చేసుకోకండి'

4 Sep, 2016 20:10 IST|Sakshi
'ప్లీజ్.. మా విషయంలో జోక్యం చేసుకోకండి'

ఢాకా: తమ దేశ అంతర్గత విషయాల్లో జోక్యం చేసుకోవడం సరికాదని పాకిస్థాన్కు బంగ్లాదేశ్ స్పష్టం చేసింది. తమ దేశంలో దోషిగా తేలిన ఒక వ్యక్తిని ఉరితీయడం పట్ల పాక్ స్పందించిన తీరు తమ అంతర్గత పాలనా వ్యవహారాల్లో తల దూర్చడమేనని పేర్కొంది. 1971నాటి బంగ్లాదేశ్ విముక్తి పోరాటానికి సంబంధించి దేశ ద్రోహానికి పాల్పడిన పాక్కు చెందిన జమాత్ నేత మిర్ ఖాసిం అలీని బంగ్లాదేశ్ శనివారం ఉరి తీసింది. ఈ ఉరిపట్ల పాక్ స్పందిస్తూ జమాతే నేత మిర్ ఖాసిం ఉరి తమను తీవ్రంగా బాధించిందని పాకిస్థాన్ ప్రకటించింది.

ఈ నేపథ్యంలో బంగ్లాదేశ్ విదేశాంగ శాఖ అదనపు కార్యదర్శి పాకిస్థాన్ హై కమిషనర్ సమీనా మెహ్తాబ్కు నోటీసులు పంపించారు. పాక్ ప్రకటనపట్ల తమ అసంతృప్తిని వ్యక్తం చేశారు. మిర్ ఖాసిం విషయంలో దర్యాప్తు చాలా నిస్పక్షపాతంగా, పారదర్శకంగా అందరి సమక్షంలో జరిగిందని చెప్పారు. మిర్ ఖాసింను ఉరి తీసిన గంటలోనే పాక్ ఒక ప్రకటన విడుదల చేసింది. గొప్ప వ్యక్తి తప్పుడు న్యాయ విధానం ద్వారా ఉరితీతకు గురియ్యారని, ఇది తమను తీవ్రంగా బాధించిందని అందులో పేర్కొనగా ఆ వెంటనే బంగ్లాదేశ్ కూడా ఘాటుగా స్పందించింది.

మరిన్ని వార్తలు