బాత్‌రూంలో ఫోన్ వాడుతున్నారా..

20 Oct, 2017 16:02 IST|Sakshi

స్మార్ట్ ఫోన్.. అది లేకుండా రోజు గడవదు.. ఎక్కడికెళ్లినా ఏం చేసినా ఫోన్ ఉండాల్సిందే. ప్రస్తుతం ఉదయం లేచినప్పటి నుంచి అర్ధరాత్రి పడుకునే వరకు ఫోన్ పక్కన ఉండాల్సిందే. స్నేహితులతో మాట్లాడాలన్నా.. ఫేస్‌బుక్‌లో ఫోటోలు పెట్టాలన్న స్మార్ట్‌ ఫోన్ ఉండాల్సిందే. మనిషి ఫోనుకు ఎంతలా బానిస అయ్యాడంటే చివరకు బాత్‌రూం  వెళ్లే సమయంలో కూడా ఫోన్ వదలడం లేదు. అయితే ఏంటీ.? ఇదంతా ఎందుకు చెబుతున్నారనుకుంటున్నారా..? మీరే చూడండి. 

బాత్‌రూం లో ఫోన్ వాడటం చాలా ప్రమాదకరం.  మీరు బాత్‌రూంలో ఫోన్ మాట్లాడే, వాడే అలవాటు ఉంటే ఇక నుంచి అయినా మీ అలవాటు మార్చుకోండి. బాత్‌రూం లోకి ఫోన్ తీసుకుపోవడం వల్ల తొందరగా అనారోగ్యం పాలవుతారని ఓ సర్వే తెలిపింది. మనం చేసే చాటింగులు,  ఫేస్‌బుక్‌ కాసేపు పక్కనపెడితే మీ ఆరోగ్యానికి ఏ మాత్రం ఢోకా ఉండదు.

బాత్‌రూంలో ఉండే బ్యాక్టీరియా నేరుగా కంటే ఫోన్‌ మీదకు ఎక్కువ వ్యాపిస్తుంది. మీరు  చేతులు శుభ్రపరచుకున్న బాత్‌రూంలోకి తెచ్చుకున్న ఫోన్‌ను ముట్టుకోవడం ద్వారానే బ్యాక్టీరియా వేగంగా వ్యాపిస్తుందని తెలిసింది.  తద్వారా మీరు చేతులు శుభ్రపరుచుకున్నా ఉపయోగం లేదు. పబ్లిక్ టాయిలెట్లు ఉపయోగిస్తే ఈ ప్రమాదం మరింత పెరుగుతుంది. పలురకాల బ్యాక్టీరియా ఫోను ద్వారా వ్యాప్తి చెంది అనారోగ్యం పాలయ్యే అవకాశం మరింత ఎక్కువగా ఉంది. ఒక్క మొబైలే కాదు టవల్స్, బ్రష్ ద్వారా కూడా జబ్బులు వేగంగా వ్యాపిస్తాయి.

మరిన్ని వార్తలు