భారత్‌ ఇలా చేయొద్దు..వెంటనే తగ్గాలి: చైనా

18 Jul, 2017 16:03 IST|Sakshi
భారత్‌ ఇలా చేయొద్దు..వెంటనే తగ్గాలి: చైనా

బీజింగ్‌: భారత్‌ తన రాజీకయ లక్ష్యాలకోసం సిక్కింలోని డోక్లామ్‌ భూభాగాన్ని పాలసీ టూల్‌గా ఉపయోగించుకోవద్దని చైనా చెప్పింది. ఇరు దేశాల మధ్య మరింత ఉద్రిక్త పరిస్థితులు పెరగకుండా ఉండాలంటే భారత్‌ వెంటనే డోక్లామ్‌లోని తన సైన్యాన్ని వెనక్కి పిలిపించుకోవాలని చైనా విదేశాంగ శాఖ కోరింది. విదేశాంగ వ్యవహారాల విషయంలో తమకు భారత్‌కు చాలా దగ్గరి సంబంధాలు ఉన్నాయని, వీటిపై ముందుకు వెళ్లాలంటే ముందు భారత్‌ తన సైన్యాన్ని ఉపసంహరించుకోవాలని, అప్పటి వరకు తమ మధ్య సంబంధాలపై ఎలాంటి సమాధానం ఇవ్వలేమని పేర్కొంది.

'అక్రమంగా భారత సరిహద్దు సేనలు డోక్లామ్‌కు చేరుకున్నాయని తెలిశాక చైనాలోని పలువురు విదేశాంగ ప్రతినిధులు షాకయ్యారు. ఈ విషయం నిజమేనా అని తెలుసుకోవాలనుకుంటున్నారు' అని చైనా విదేశాంగ అధికార ప్రతినిధి లూకాంగ్‌ మీడియాకు తెలిపారు. రాజకీయ లక్ష్యాలకోసం భారత్‌ ఇలాంటి విధానం ఎంచుకోవడం సరికాదని వ్యాఖ్యానించారు. 'భారత్‌ ఈ విషయంలో చాలా స్పష్టంగా ఉండాలి.  ప్రస్తుత పరిస్థితిని భారత్‌ అర్థం చేసుకొని వెంటనే అక్రమంగా సరిహద్దు దాటి వచ్చిన తన సైన్యాన్ని ఉపసంహరించుకునేందుకు తగిన చర్యలు తీసుకుంటుందని అనుకుంటున్నాం' అని ఆయన పేర్కొన్నారు.

>
మరిన్ని వార్తలు