హెచ్‌ -1బి వీసాలపై కంపీట్‌ అమెరికా ఫిర్యాదు

9 Nov, 2018 13:08 IST|Sakshi

వాషింగ్టన్‌: అమెరికా మధ్యంతర ఎన్నికల ఫలితాల్లో హౌస్‌లో అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ను డొమొక్రాట్లు గట్టి దెబ్బతీసారు. మరోవైపు టాప్‌ ఐటీ కంపెనీలకు జారీ అయ్యే వీసాలపై ప్రముఖ ఐటీ కంపెనీల సంఘం కంపీట్‌ అమెరికా  కీలక వ్యాఖ్యలు చేసింది. ట్రంప్‌ సర్కార్‌ హయాంలో విదేశీ ఐటీ నిపుణులకిచ్చే హెచ్‌ 1బీ వీసాల జారీ నిలుపుదల సంఖ్య బాగా పెరిగిందని తేల్చి చెప్పింది. ఈ సంఘంలో గూగుల్‌, ఫేస్‌బుక్‌, మైక్రోసాఫ్ట్‌ తదితర కంపెనీలు సభ్యులుగా ఉండటం గమనార్హం​.
 
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ హయాంలో హెచ్‌-1బీ వీసాల జారీ నిలుపుదల బాగా పెరిగిపోయిందని కంపీట్‌ అమెరికా తెలిపింది. అమెరికా సిటిజన్‌షిప్‌ అండ్‌ ఇమ్మిగ్రేషన్‌ సర్వీసెస్‌(యూఎస్‌సీఐఎస్‌) దాని సొంత నిబంధనలను ఉల్లంఘిస్తోందని కంపీట్ అమెరికా ఆరోపించింది. హెచ్‌-1బీ వీసా దరఖాస్తులు అధిక సంఖ్యలో యూఎస్‌సీఐఎస్‌ వద్ద హోల్డ్‌లో ఉంటున్నాయని ఫిర్యాదు చేసింది. అంతేకాదు అయితే ట్రంప్‌ యంత్రాగం ఆధ్వర్యంలో హెచ్‌-1బీ వీసాల న్యాయ విచారణ పద్ధతుల్లో మూడు ప్రధానమైన మార్పులు గమనించామని కంపీట్‌ అమెరికా పేర్కొంది. న్యాయపరమైన నిబంధనలలో చాలా అసమానతలు ఉన్నాయని వెల్లడించింది. ఈ మేరకు సెక్రటరీ ఆఫ్‌ హోంల్యాండ్‌ సెక్యూరిటీ క్రిస్ట్‌ జెన్‌ నీల్సన్‌, యూఎస్‌సీఐఎస్‌ డైరెక్టర్‌ ఎల్‌ ఫ్రాన్సిస్‌ సిస్‌నా కంపీట్‌ అమెరికా నవంబరు 1వ తేదీన ఒక లేఖ  రాసింది.

ఈ విధానం యజమానులను  గందరగోళంలో పడవేస్తోందని కంపీట్ అమెరికా ఆరోపించింది. యూఎస్‌సీఐఎస్‌ పద్ధతులు, నిబంధనల పట్ల కంపెనీలకు సరైన అవగాహన లేకుండా పోయిందనీ,  ఈ అనిశ్చితి వల్ల అత్యంత నిపుణులైన విదేశీ ఉద్యోగులను నియమించుకుంటున్న కంపెనీలు సమస్యలు ఎదుర్కొంటున్నాయని తెలిపింది. గత 18 నెలల్లో కంపెనీలకు రిక్వెస్ట్‌ ఫర్‌ ఎవిడెన్స్‌(ఆర్‌ఎఫ్‌ఈ)లు, దరఖాస్తుల తిరస్కరణలు బాగా పెరిగిపోయాయని వెల్లడించింది.

కాగా డొనాల్డ్‌ ట్రంప్‌ సర్కారు హెచ్‌-1బీ వీసా చట్టాల్లో పలు మార్పులను తీసుకొవస్తున్నసంగతి తెలిసిందే. ఈ హెచ్‌-1బీ వీసా ద్వారా అమెరికాలోని కంపెనీల్లో ఉద్యోగం చేసే విదేశీయులు, ముఖ్యంగా భారతీయ ఐటీ ఉద్యోగులను భారీగా ప్రభావితం చేస్తోంది.

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

ప్రపంచవ్యాప్తంగా ఎబోలా ఎమర్జెన్సీ! 

ఆమె వచ్చింది.. అతన్ని చితక్కొట్టింది

ఫ్రెంచ్‌ కిస్‌తో డేంజర్‌!

‘పాకిస్తాన్‌ హిట్లర్‌గా ఇమ్రాన్‌’

ఉపాధి వేటలో విజేత

బహ్రెయిన్‌లో 26న ఓపెన్‌ హౌస్‌

‘నేను డయానాను.. నాకిది పునర్జన్మ’

లండన్‌ సురక్షిత నగరమేనా?

యానిమేషన్‌ స్టూడియోకు నిప్పు

హెచ్‌1బీ ఫీజుతో అమెరికన్లకు శిక్షణ

దారుణం: 24 మంది సజీవ దహనం

మీరు అసలు మనుషులేనా..ఇంతలా హింసిస్తారా?

రెండు కళ్లలోకి బుల్లెట్లు దూసుకుపోయి..

అవినీతి కేసులో పాక్‌ మాజీ ప్రధాని అరెస్ట్‌

ఇంతకు ‘తను’ తండ్రా, తల్లా?!

నీకు నోబెల్‌ వచ్చిందా? గొప్ప విషయమే!

ఆ ఏడాది దాదాపు 2000 రేప్‌లు...!

32నామినేషన్లు కొల్లగొట్టిన 'గేమ్‌ ఆఫ్‌ థ్రోన్స్‌'

తొలిసారి ఎయిర్‌పోర్ట్‌కొచ్చి.. ఆగమాగం!

ఒక్కసారి బ్యాటింగ్‌ మొదలుపెడితే..

ఉగ్ర సయీద్‌ అరెస్ట్‌

ప్రతిభ వలసల వీసాలు 57 శాతం

ఉరి.. సరి కాదు

అంతరిక్ష పంట.. అదిరెనంట!

సోషల్‌ మీడియాతో చిన్నారుల్లో మానసిక రుగ్మతలు

అంతర్జాతీయ కోర్టులో భారత్‌కు విజయం

నాడు చంద్రుడి యాత్ర విఫలమైతే..

అంతుచిక్కని రోగం: ముఖం భయంకరంగా..

గ్లోబల్‌ టెర్రరిస్ట్‌ హఫీజ్‌ సయీద్‌ అరెస్ట్‌

నిర్లవణీకరణకు కొత్త మార్గం!

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

తెలుగు సినిమాకి మంచి కాలం

సోడాల్రాజు

నో కాంప్రమైజ్‌

సముద్రాల రచనలు పెద్ద బాలశిక్ష

ధృవ కష్టం తెలుస్తోంది

భయాన్ని వదిలేసిన రోజున గెలుస్తాం