కదులుతున్న బస్సులో.. డ్రైవర్ డాన్సులు!

31 Dec, 2014 12:47 IST|Sakshi
కదులుతున్న బస్సులో.. డ్రైవర్ డాన్సులు!

అది అత్యంత రద్దీగా ఉండే జాతీయ రహదారి. అలాంటి ప్రాంతంలో.. కదులుతున్న బస్సులో ఓ డ్రైవర్ మంచి మసాలా పాటకు డాన్సు చేస్తూ కెమెరాకు దొరికేశాడు. ఈ ఘటన టర్కీ రాజధాని ఇస్తాంబుల్ ప్రాంతంలో జరిగింది. ప్రయాణికుల్లో ఒకరు ఈ వ్యవహారం మొత్తాన్ని వీడియో తీశారు. అది సోషల్ మీడియాలో విస్తృతంగా వ్యాపించడంతో టర్కీ పోలీసులు వెంటనే ఆ డ్రైవర్ లైసెన్సును రద్దుచేయడంతో పాటు.. జరిమానా కూడా విధించారు.

ఈ వీడియోలో డ్రైవర్ మెటిన్ కాందెమిర్ అప్పుడప్పుడు తన సీట్లోంచి లేచి మరీ డాన్సులు చేశాడు. అప్పటివరకు ఆ పాటలను బాగా ఈలలు, కేకలతో ఆస్వాదించిన ప్రయాణికులు కూడా డ్రైవర్ డాన్సు చూసి బెదిరిపోయారు. అతడిని ఆ తర్వాత పోలీసులు అదుపులోకి తీసుకుని, సుమారు రూ. 5 వేల జరిమానా విధించారు. అతడు గత పదేళ్లుగా మినీబస్సు డ్రైవర్గా పనిచేస్తున్నాడు.

మరిన్ని వార్తలు