ద్రోన్ దాడులకు పాకిస్థాన్‌ గ్రీన్‌సిగ్నల్!

26 Oct, 2013 04:57 IST|Sakshi

ఐక్యరాజ్యసమితి/ఇస్లామాబాద్: పాకిస్థాన్‌లోని అరాచక గిరిజన ప్రాంతాల్లో అమెరికా నిఘా సంస్థ సీఐఏ ద్రోన్ డాడులకు ఆ దేశ సైనిక ప్రభుత్వమే ఆమోదం తెలిపిందా? ఐక్యరాజ్యసమితి నివేదిక ఒకటి అవుననే సమాధానం ఇస్తోంది. ఇందుకు బలమైన సాక్ష్యాధారాలు కూడా ఉన్నట్లు ఆ నివేదిక కుండబద్ధలు కొడుతోంది. ఉగ్రవాదంపై పోరాటంలో మానవహక్కులు, ప్రాథమిక స్వేచ్ఛ పరిరక్షణ, ప్రోత్సాహంపై ఐక్యరాజ్యసమితి ప్రత్యేకంగా నియమించిన బెన్ ఎమ్మర్సన్ అధ్యయనం చేశారు. 2004-08 మధ్యకాలంలో పాక్ గిరిజన ప్రాంతాల్లో జరిగిన ద్రోన్ దాడులకు ఆ దేశ సైనిక ఉన్నతాధికారులతో పాటు ప్రభుత్వ ఆమోదం కూడా ఉందని తన నివేదికలో ఆయన పేర్కొన్నారు.
 
  ఈ మేరకు 24 పేజీల నివేదికను ఆయన రూపొందించారు. ఇటీవల అమెరికా అధ్యక్షుడు ఒబామాతో భేటీ అయిన పాకిస్థాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ తమ భూభాగంలో ద్రోన్ దాడులను ఆపాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. ఈ నేపథ్యంలోనే ఇలాంటి దాడులకు పాక్ ప్రభుత్వమే అనుమతిచ్చిన విషయం వెలుగుచూసింది. ఒబామా, షరీఫ్‌ల భేటీ నేపథ్యంలో పాక్ గిరిజన ప్రాంతాల్లో ద్రోన్ దాడులు నిలిచిపోతాయని ఆ దేశం ఆశిస్తోంది. అంతర్జాతీయ నేర న్యాయస్థానం దృష్టికి ఈ దాడుల విషయం తీసుకెళ్లే అం శాన్ని  పాక్ విదేశాంగ ప్రతినిధి తోసిపుచ్చారు.

>
మరిన్ని వార్తలు