డ్రగ్స్ వదిలేసి రికార్డులు సృష్టించాడు

8 Sep, 2016 17:37 IST|Sakshi
డ్రగ్స్ వదిలేసి రికార్డులు సృష్టించాడు

ఒహియో: అతడు పదేళ్లకు పైగా మత్తుపదార్థాలకు బానిసయ్యాడు. పక్కనే కొకైన్ లేకుంటే పిచ్చి లేసినవాడిలా ప్రవర్తించేవాడు. వ్యక్తిగతంగా సామర్థ్యంకలిగిన వాడైనప్పటికీ డ్రగ్స్ బారిన పడి మొత్తానికే గుర్తింపు పోగొట్టుకుని అందరితో చీకొట్టించుకున్నాడు. కానీ, పోగొట్టుకున్న చోటే రాబట్టుకోవాలనే చందంగా తిరిగి తన గతంపై తానే తిరగబడ్డాడు. డ్రగ్స్ వాడకాన్ని నియంత్రించుకొని విజేతగా మారడాడు. ఏకంగా ట్రయ్థ్లాన్ పూర్తి చేశాడు.

అంటే వరుసగా మూడురోజుల్లో నీటిలో ఈదడం, సైక్లింగ్ చేయడం, పరుగెత్తడంలాంటివి పూర్తి చేశాడు. అతడే టాడ్ క్రాండెల్. మత్తుపదార్థాల బారిన పడిన ఇతడు తిరిగి తన సామర్థ్యాన్ని తాను తెలుసుకొని అసలైన ప్రయత్నం ప్రారంభించాడు. ఆరు మైళ్లు ఈదడం, 261 మైళ్లు సైకిల్ తొక్కడం, 52 మైళ్లు పరుగెత్తడం ద్వారా ట్రయ్థ్లాన్ పూర్తి చేసి రికార్డు సృష్టించాడు. మొత్తం హవాయి ప్రాంతంలోనే ఈ తరహా రికార్డు సృష్టించడం ఒక్క టాడ్కే సొంతమైంది. పూర్తిగా డ్రగ్స్కు బానిస అయిన అతడిని పోలీసులు మూడోసారి అరెస్టు చేసిన తర్వాత తన జీవితాన్ని మార్చుకోవాలన్ని నిర్ణయించుకొని ఈ అద్భుతాన్ని ఆవిష్కరించాడు.

మరిన్ని వార్తలు