కో పైలట్ నిర్వాకానికి విమానం రద్దు

27 Mar, 2016 17:26 IST|Sakshi
కో పైలట్ నిర్వాకానికి విమానం రద్దు

వాషింగ్టన్: కో పైలట్ చేసిన నిర్వాకానికి విమాన సర్వీసును చివరి నిమిషంలో రద్దు చేయాల్సి వచ్చింది. అమెరికన్ ఎయిర్లైన్స్ కో పైలట్ మద్యంతాగి విధులకు హాజరుకావడంతో పోలీసులు ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. శనివారం డెట్రాయిట్ ఎయిర్పోర్టులో ఈ ఘటన జరిగింది.

విధులకు హాజరయినపుడు విమానాశ్రయంలో కో పైలట్కు బ్రీత్ఎనలైజర్ పరీక్షలు నిర్వహించగా, ఆయన మద్యం తాగినట్టు వెల్లడైంది. దీంతో పోలీసులు కో పైలట్ను కస్టడీలోకి తీసుకున్నారు. దీనికారణంగా డెట్రాయిట్ నుంచి ఫిలడెల్ఫియాకు వెళ్లాల్సిన 736 ఫ్లయిట్ను అమెరికన్ ఎయిర్లైన్స్ రద్దు చేసింది. ఇతర విమాన సర్వీసుల్లో వెళ్లాల్సిందిగా ప్రయాణకులను కోరింది. ప్రయాణికుల భద్రతకు తాము అధిక ప్రాధాన్యమిస్తామని, అంతరాయం కలిగించినందుకు క్షమాపణలు చెప్పామని సంస్థ ప్రతినిధులు చెప్పారు. కాగా కో పైలట్ పేరును వెల్లడించలేదు. ఆయనకు మత్తు దిగాక విడిచిపెట్టారు.

>
మరిన్ని వార్తలు