సెక్స్ చేయమంటూ టాప్ లెస్ గా హల్ చల్...

16 Apr, 2016 06:00 IST|Sakshi
సెక్స్ చేయమంటూ టాప్ లెస్ గా హల్ చల్...

షాంఘై: ఓ మహిళ తప్పతాగి నడిరోడ్డుపై చేసిన వింతచర్యకు అందరూ ఆశ్చర్యానికి లోనయ్యారు. షాంఘై నడిరోడ్డుపై అర్ధనగ్నంగా కాసేపు నిలబడి అక్కడివారిని ఇబ్బందులకు గురిచేసింది. ఆ వివరాలిలా ఉన్నాయి... ఓ మహిళ షాంఘైలోని ప్రధాన రహదారిపై వెళ్తుంది. ఇంతలో రోడ్డు పక్కన తన పై దుస్తులను జనాలు అందరూ చూస్తుండగానే విప్పేసింది. అంతటితో ఆగలేదు... రోడ్డుపై అటుగా వెళ్తున్న ఓ టూరిస్టును ఆమె తన సెక్స్ అవసరాన్ని తీర్చుకోవడానికి లక్ష్యంగా చేసుకుంది. అతడి వద్దకు వెళ్లి తనతో సెక్స్ చేయమంటూ నానా హంగామా చేసింది. ఆ సమయంలో ఆమె టాప్ లెస్ గా ఉండటంతో ఆ టూరిస్ట్ మొదట ఆశ్చర్యానికి గురైనా వెంటనే మహిళ చర్య నుంచి తేరుకున్నాడు. ఆమెతో సెక్స్ చేసేందుకు అతడు నిరాకరించాడు.

తనతో శృంగారం చేస్తే చాలా మంచి అనుభూతిని పొందుతావంటూ టూరిస్ట్ ను ప్రాథేయపడింది. ఆమె ఎంతగా అభ్యర్థించినా ఆ గుర్తుతెలియని వ్యక్తి ఆ చర్యకు అంగీకరించలేదు. ఆమెను పక్కకునెట్టేసి తన దారిన తాను వెళ్లడానికి ప్రయత్నించాడు. దీంతో ఆ మహిళకు కోపం వచ్చింది. టూరిస్ట్ ను డ్రెస్ విప్పేయమంటూ తొందరపెట్టసాగింది. విసుగుచెందిన ఆ వ్యక్తి ఆమెను పక్కకునెట్టేసి వెళ్లిపోయాడు. ఇంతలోనే సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకున్నారు. దుస్తులు వేసుకోవాలని ఆమెను హెచ్చరించారు. అర్ధనగ్నంగా అలాగే ఉండి వారిని కూడా కాస్త ఇబ్బంది పెట్టింది. చివరికి ఆమె దుస్తులను తీసుకుని పోలీసులు ఆ మహిళను అరెస్ట్ చేసి స్టేషన్ కు తరలించారు. మహిళ మద్యం సేవించి ఉందని అందుకే ఆ మత్తులో ఇలాంటి పనులు చేసిందని పోలీసులు తెలిపారు.

మరిన్ని వార్తలు