క‌రోనా: బుర్జ్ ఖ‌లీఫా‌లో అమ్ముడుపోయిన‌ 12 ల‌క్ష‌ల లైట్లు

13 May, 2020 10:36 IST|Sakshi

దుబాయ్‌ : దుబాయ్‌లో ఉన్న ప్ర‌పంచంలోనే ఎత్త‌యిన భ‌వ‌‌నం బుర్జ్ ఖ‌లీఫా నిర్వాహ‌కులు వినూత్న ప‌ద్ద‌తికి శ్రీకారం చుట్టారు. క‌రోనా వ‌ల్ల ఇబ్బందులు ప‌డే పేద ప్ర‌జ‌ల‌ను ఆదుకునేందుకు విరాళాల సేక‌ర‌ణ ప్రారంభించారు. ఈ ప్ర‌క్రియ‌లో భాగంగా దాత‌లెవ‌రైనా 10 దిర్హామ్‌ల విరాళం(ఒక భోజ‌నానికి అయ్యే ఖ‌ర్చు) అందిస్తే బుర్జ్ ఖ‌లీఫా భ‌వ‌నం ముందు భాగంలో ఒక లైటు వెలిగించేలా ఏర్పాట్లు చేశారు. అయితే ఇప్ప‌టి వ‌ర‌కు మొత్తం 12 ల‌క్ష‌ల మంది విరాళాలు అందించ‌డంతో 1.2 మిలియ‌న్ల లైట్లు అమ్ముడుపోయాయని నిర్వ‌హ‌కులు తెలిపారు. ఈ సంద‌ర్భంగా 12 ల‌క్ష‌ల లైట్ల‌ను వెలిగించి దాత‌ల్లో స్పూర్తి నింపారు. (ఒక్కరోజులో 3,525 కేసులు )

కాగా రంజాన్ సంద‌ర్భంగా ఎంబీఆర్‌జీఐ(ఆర్గనైజింగ్ బాడీ ద మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ గ్లోబల్ ఇనిషియేటివ్స్) ద్వారా త‌క్కువ ఆదాయం క‌లిగిన కుటుంబాలకు దాదాపు 10 మిలియ‌న్ల భోజ‌నానికి స‌రిప‌డే నిధులు స‌మకూర్చేందుకు ఈ విరాళ సేక‌ర‌ణ ప్ర‌క్రియ చేప‌ట్టిన‌ట్లు దుబాయ్ పాల‌కుడు, యూఏఈ ఉపాధ్యక్షుడు షేక్ మ‌హ‌మ్మ‌ద్ బిన్ ర‌షీద్ అల్ మ‌క్తూమ్ తెలిపారు. ఇక క‌రోనా కార‌ణంగా దుబాయి ఆర్థిక ప‌రిస్థితి విప‌రీతంగా దెబ్బ‌తింది. ప్ర‌పంచంలోనే అత్యంత ర‌ద్దీగా ఉండే అంత‌ర్జాతీయ విమానాశ్ర‌యాలు, ప‌ర్యాట‌క ప్రాంతాలు, వ్యాపారాలు పూర్తిగా కుప్ప‌కూలిపోయాయి. యూఏఈలో ఇప్ప‌టి వ‌ర‌కు 19,881 క‌రోనా కేసులు న‌మోద‌వ్వ‌గా 203 మంది ప్రాణాలు కోల్పోయారు. (పట్టాలెక్కిన రైళ్లు.. ప్రయాణానికి రెడీనా! )

మరిన్ని వార్తలు