దుబాయ్‌లో మరో అద్భుత కట్టడం..

20 Feb, 2017 19:12 IST|Sakshi
దుబాయ్‌లో మరో అద్భుత కట్టడం..

దుబాయ్‌ పేరు చెప్పగానే వెంటనే గుర్తొచ్చేది ప్రపంచంలోనే ఎత్తైన బుర్జ్ ఖలీఫా భవనం. అయితే బూర్జ్‌ అంత ఎత్తు కాకపోయినా దాన్ని మరిపించేలా మరో భవంతిని దుబాయ్‌లో నిర్మిస్తున్నారు. దీంట్లో ఏముందిలే అని తీసిపారేయకండి. అది నిజంగా ఓ అద్భుతమే. ఎందుకంటే ఆ భవంతిలో ఉన్న ప్లాట్లను ఇష్టానుసారంగా తిప్పేయొచ్చు. అవునండి అదేలా అనుకుంటున్నారా ?

ఎత్తైన భవనంలో హాయిగా వరండాలో కూర్చొని సూర్యోదయం ఎవరైనా చూసే ఉంటారు. కానీ అదే వరండాలో కూర్చున్న చోటు నుంచే సూర్యాస్తమయాన్ని కూడా వీక్షించేలా ఓ భారీ నిర్మాణాన్ని మనం త్వరలో చూడబోతున్నాము. దుబాయ్లోని డైనమిక్‌ టవర్ హోటల్‌లో ఒక్కో అంతస్తుల్లో దేనికి అవే సేపరేట్‌గా ఉన్న ప్లోర్‌లను నిర్మిస్తున్నారు. ముందుగా మధ్యభాగంలో నిర్మించిన ఎత్తైన కాంక్రీట్ నిర్మాణానికి వేరే చోటున తయారు చేసిన యూనిట్లను అటాచ్‌ చేస్తూ ఈ భారీ ఆకాశహర్మ్యాన్ని రూపొందిస్తున్నారు. తన చుట్టు తాను తిరిగేలా ఉన్న ఈ ఆకాశహర్మ్యం నిజంగా నిర్మాణ రంగంలో ఓ నూతన అధ్యాయంగా చెప్పొచ్చు.