నిజాయితీకి కేరాఫ్ దుబాయ్

16 Jan, 2015 16:16 IST|Sakshi
నిజాయితీకి కేరాఫ్ దుబాయ్

మన దేశంలో పొరపాటున మనం ఏదైనా వస్తువుని పొగొట్టుకుంటే ఇక దానిపై ఆశలు వదులుకోవాల్సిందే. వస్తువు పొగొట్టుకున్న 2 నిమిషాలకే వెతికినా ప్రయోజనం శూన్యం. కానీ దుబాయ్లో సీన్ రివర్సయింది. ఆశ్చర్యకర విషయం ఏంటంటే ఒక వ్యక్తి ఉద్దేశపూర్వకంగా తన పర్సును వదిలించుకోవాలని విశ్వప్రయత్నాలు చేసి విఫలమయ్యాడు.

ఆ వ్యక్తి ఒకసారి షాపింగ్ మాల్ వద్ద, మరోసారి వీధుల వెంట, ఇంకోసారి పుట్పాత్ ఇలా ఒకటి.. రెండు డు సార్లు కాదు.. ఏకంగా 25 సార్లు తన పర్సును కావాలనే అక్కడా ఇక్కడా పారేశాడు. కానీ ప్రతిసారీ ఎవరో ఒకరు ఆ పర్సును తీసి అతనికిచ్చేవారు, కొన్నిసార్లు పిలిచి విషయాన్ని కూడా చెప్పేవారు. ఆ విధంగా అతను చేసిన ప్రతి ప్రయత్నం విఫలమైంది. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు.. దుబాయ్ నిజాయితీకి నిలువుటద్దం అని.

మరిన్ని వార్తలు