క‌రోనా: ప‌దివేల జంతువుల వ‌ధ‌!

7 Jun, 2020 16:58 IST|Sakshi

ఆమ్‌స్ట‌ర్‌డామ్‌: క‌రోనా మ‌నుషు‌లు, మూగ‌జీవాల‌ మ‌ధ్య బంధాన్ని దూరం చేసిందా? ద‌గ్గ‌ర చేసిందా? అనే ప్ర‌శ్న‌కు బ‌హుశా స‌రైన‌ స‌మాధానం దొర‌క్క‌పోవ‌చ్చు. ఎందుకంటే క‌రోనా బ‌య‌ట‌ప‌డ్డ తొలినాళ్ల‌లో చైనా స‌హా ప‌లు దేశాల ప్ర‌జ‌లు పెంపుడు జంతువులే ఈ మ‌‌హమ్మారి వ్యాప్తికి కార‌ణ‌మ‌వుతున్నాయ‌న్న అపోహ‌తో జ‌నం వాటిని నిర్దాక్షిణ్యంగా రోడ్ల మీద‌కు విసిరేశారు. అయితే పెంపుడు జంతువుల వ‌ల్ల క‌రోనా వ్యాపిస్తుంద‌న‌డానికి స‌రైన ఆధారాలు లేవ‌ని వైద్యులు వెల్ల‌డించ‌డంతో మూగ‌జీవాల‌పై వివ‌క్ష మానుకున్నారు. అటు జూలో ఉన్న జంతువుల‌కూ మ‌నుషుల ద్వారా వైర‌స్‌ వ్యాపించడం అప్ప‌ట్లో సంచ‌ల‌నం రేపిన విష‌యం తెలిసిందే. (ఇటలీని దాటేసిన భారత్‌)

ఇదిలా వుండ‌గా క‌రోనా భ‌యంతో నెద‌ర్లాండ్ ప్ర‌భుత్వం మింక్‌ల‌ను చంపేందుకు నిర్ణ‌యం తీసుకుంది. ఇప్ప‌టివ‌ర‌కు మింక్‌ల ద్వారా ఇద్ద‌రు వ్య‌క్తుల‌కు క‌రోనా వ్యాప్తి చెందిన‌ట్లు ప్ర‌భుత్వం గుర్తించింది. దీంతో వాటివ‌ల్ల మానవుల‌కు వైర‌స్ ముప్పు పొంచి ఉంద‌ని అభిప్రాయ‌ప‌డిన ప్ర‌భుత్వం మింక్‌ల‌ను హ‌త‌మార్చాల‌ని ఆదేశించింది. ఈ నేప‌థ్యంలో మింక్ ఫార్మ్‌ల‌ను అన్నింటినీ నేల‌మ‌ట్టం చేయాల‌ని స్ప‌ష్టం చేసింది. దీంతో 10వేల మింక్‌లు‌ మృత్యువాత ప‌డ‌నున్నాయి. కాగా చైనా, డెన్మార్క్‌, పోలాండ్ దేశాలు మింక్‌ల సంఖ్య ఎక్కువ‌గా ఉండ‌గా ప్ర‌తి ఏడాది 60 మిలియ‌న్ల మింక్‌ల‌ను హ‌త‌మారుస్తున్నారు. (మరింత తగ్గిన మరణాల రేటు)

మరిన్ని వార్తలు