అవి టీనేజర్లను ప్రేరేపిస్తున్నాయ్!

14 Apr, 2016 17:08 IST|Sakshi
అవి టీనేజర్లను ప్రేరేపిస్తున్నాయ్!

లండన్: సిగరెట్ అలవాటు ఉన్న వారిని మాన్పించడానికి మార్కెట్లోకి వచ్చిన ఈ-సిగరెట్ల గురించి ఓ విస్మయపరిచే నిజం తెలిసింది. మార్కెట్‌లో ఈ-సిగరెట్ల మితిమీరిన ప్రమోషన్‌ వల్ల స్మోకింగ్ను వదిలేసే వారి సంగతి అలా ఉంచితే.. కొత్తగా మొదలుపెట్టేవారి సంఖ్య పెరుగుతోందట. ముఖ్యంగా ఈ-సిగరెట్లు.. టీనేజర్లను విపరీతంగా ఆకట్టుకొని అటువైపు లాగుతున్నాయని యూనివర్సిటీ ఆఫ్ స్టిర్లింగ్ పరిశోధకులు నిర్వహించిన పరిశీలనలో తేలింది.

ఈ-సిగరెట్ల ప్రమోషన్ల విషయంలో జాగ్రత్తలు వహించాలని, లేదంటే 11 ఏళ్ల నుంచి 18 సంవత్సరాల మధ్య వయసులోని వారు వీటి ప్రభావానికి ఆకర్షితులౌతున్నారని పరిశోధనలో పాల్గొన్న కేథరిన్ బెస్ట్ పేర్కొన్నారు. సుమారు నాలుగు వేల మంది పాఠశాల విద్యార్థులపై జరిపిన పరిశీలనలో ఈ ఫలితాలు వెల్లడయ్యాయి. ఈ-సిగరెట్లను కేవలం వయోజన పొగరాయుళ్లకు ఉపశమనం కలిగించేందుకు మాత్రమే అనే విషయాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రమోషన్ చేయాలని లేదంటే టీనేజర్లు భవిష్యత్తులో వీటికి బాగా అలవాటు పడే అవకాశం ఉందని వెల్లడించారు.

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు