తైవాన్ భూకంపం: నేలమట్టమైన భారీ భవంతులు

6 Feb, 2016 08:46 IST|Sakshi

తైపీ: తూర్పు ఆసియాలోని ద్వీపదేశం తైవాన్ లో శనివారం తెల్లవారుజామున సంభవించిన భూకంపం విషాదాన్ని మిగిల్చింది. ఈశాన్య ప్రాంతంలోని కావోషింగ్ కేంద్రంగా భూమికి 10 కిలోమీటర్ల లోతులో కేంద్రీకృతమైన ఈ భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.4గా నమోదయింది. ప్రకంపనల ప్రభావంతో తైనాన్ పట్టణంలోని పలు భారీ భవంతులు నేల కూలాయి.

150 మందికిపైగా శిధిలాలకింద చిక్కుకుపోగా, 10 రోజుల చిన్నారి సహా ముగ్గురు మరణించినట్లు తైవాన్ విపత్తు నిర్వహణ అధికారులు చెప్పారు. తైనాన్ లో ఒక చోట 17 అంతస్తుల రెసిడెన్షియల్ కాంప్లెక్స్ కూలిన దృశ్యాలు భూకంప తీవ్రత ఎంతుందో తెలియపర్చేలా ఉన్నాయి. దానితోపాటు మరో 60 అపార్ట్ మెంట్లు కూడా దెబ్బతిన్నట్లు తెలిసింది.

 

 

మరిన్ని వార్తలు