అలస్కాలో భారీ భూకంపం

23 Jan, 2018 19:01 IST|Sakshi

అలస్కా : అలస్కాలోని కొడియక్‌ ఐలాండ్‌ కేంద్రంగా మంగళవారం భారీ భూకంపం సంభవించింది. భూకంప తీవ్రత రిక్టర్‌ స్కేలుపై 7.9గా నమోదైనట్లు అమెరికా జియోలాజికల్‌ సర్వే పేర్కొంది. భూకంప తీవ్రత అధికంగా ఉండటంతో తొలుత నేషనల్‌ సునామీ సెంటర్‌ సునామీ హెచ్చరిక జారీ చేసింది.

వాషింగ్టన్‌, ఒరెగాన్‌, కాలిఫోర్నియా, హవాయి, బ్రిటిష్‌ కొలంబియాల్లో సునామీ సంభవించే అవకాశం ఉందని అలర్ట్‌ జారీ చేసింది. కొద్దిసేపటి తర్వాత సునామీ హెచ్చరికను ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించింది. సముద్ర అలల తాడికి తక్కువగా ఉందని అందిన సమాచారం మేరకే హెచ్చరికను ఉపసంహరిస్తున్నామని వెల్లడించింది.

అయితే, తీర ప్రాంతాల్లో నివసించే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. కొడియాక్‌ ఐలాండ్‌కు ఈశాన్య దిశగా 177 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉన్నట్లు యూఎస్‌ జియోలాజికల్‌ సర్వే తెలిపింది. భూ అంతర్భాగంలో ఆరు మైళ్ల లోపల భూమిలో కదలికలు రావడం వల్ల భూకంపం సంభవించినట్లు వివరించింది.

మరిన్ని వార్తలు