అమెరికాలో 25 ఏళ్లలోనే అతిపెద్ద భూకంపం

6 Jul, 2019 09:55 IST|Sakshi

కాలిఫోర్నియా : అమెరికాలోని దక్షిణ కాలిఫోర్నియాలో మరోసారి భూమి కంపించింది. రిక్టర్‌ స్కేలుపై దీని తీవ్రత 7.1గా నమోదైంది. ఒక్కసారిగా భూమి కంపించడంతో ప్రజలు భయభ్రాంతులకు లోనయ్యారు. లాస్‌ఏంజెల్స్‌ ప్రాంతానికి 202 కిలోమీటర్ల దూరంలో భూమి కంపించినట్టు అధికారులు తెలిపారు. గత 25 ఏళ్లలో ఇదే అతి పెద్ద భూకంపమని అధికారులు ప్రకటించారు.  ఆస్తి, ప్రాణ నష్టానికి సంబంధించిన వివరాలు ఇంకా తెలియరాలేదు.

కాగా గురువారం కూడా కాలిఫోర్నోయాలో భూకంపం సంభవించింది. దాని తీవ్రత రిక్టార్ స్కేల్‌పై 6.4గా నమోదైనట్లు అమెరికా జియోలాజికల్ సర్వే విభాగం వెల్లడించింది. లాస్ ఏంజిల్స్ పట్టణానికి ఈశాన్యంలో 320 కిలో మీటర్ల దూరంలో భూకంప కేంద్రాన్ని గుర్తించినట్లు అధికారులు వెల్లడించారు. ఈ ఘటనలో ఎటువంటి ప్రాణనష్టం వాటిల్లలేదు.

మరిన్ని వార్తలు