భారీ భూకంపం.. సగం పట్టణం నేలమట్టం

24 Aug, 2016 12:28 IST|Sakshi
భారీ భూకంపం.. సగం పట్టణం నేలమట్టం

రోమ్: ఇటలీలో భారీ భూకంపం సంభవించింది. దీని ధాటికి ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. పదుల సంఖ్యలో శిథిలాలకింద పడిపోయినట్లు తెలుస్తోంది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 6.2గా నమోదైంది. బుధవారం తెల్లవారు జామున 3.36గంల అంబ్రియా ప్రాంతంలోని నోర్సియా పట్టణానికి సమీపంలో ఇది సంభవించినట్లు అమెరికా జియోలాజికల్ సర్వే తెలిపింది. మొత్తం పది కిలోమీటర్ల మేర ఈ భూకంపం ప్రభావం పడినట్లు పేర్కొంది. ఈ భూకంపం కారణంగా అమాట్రిస్ అనే టౌన్ దాదాపు సగం నేలమట్టం అయిందని, శిథిలాల కింద పలువురు చిక్కుకుపోయి ఉంటారని ఆ టౌన మేయర్ ఆందోళన వ్యక్తం  చేశారు. వంతెనలు కూలిపోయాయని, కొండచరియలు భారీగా విరిగిపడ్డాయని చెప్పారు.

(మరిన్ని చిత్రాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి)

ఇది అత్యంత ఘోరమైన భూకంపం అని అసలు ప్రాణనష్టం, ఆస్తి నష్టం ఎంత జరిగి ఉంటుందనే విషయంపై తమ వద్ద ఇంకా వివరాలు లేవని అగ్నిమాపక సిబ్బంది అధికారులు చెబుతున్నారు. ప్రకంపనలు ముందే పసిగట్టిన చాలామంది బయటకు పరుగులు తీశారని, అయినప్పటికీ శిథిలాల కింద చాలామంది ఉన్నట్లు తాము భావిస్తున్నారు. మధ్య ఇటలీలోని అకుమోలి, అమాట్రిస్, పోస్టా, అర్క్వాటా డెల్ ట్రోంటో, కారి ప్రాంతాలు దీని భారిన పడినట్లు చెప్పారు. హెలికాప్టర్లను కూడా రంగంలోకి దించారు. రోమ్ నగరానికి 150 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉంది.

మరిన్ని వార్తలు