ఇండోనేషియాలో భారీ భూకంపం

19 Aug, 2018 16:01 IST|Sakshi

జకర్తా : ఇండోనేషియాలో మరో భారీ భూకంపం సంభవించింది. లోంబన్‌ ద్వీపంలో ఆదివారం  కొన్ని సెకన్లపాటు భూమి కంపించింది. రిక్టర్‌ స్కేలుపై తీవ్రత 6.3గా నమోదైనట్లు యూఎస్‌ జియోలాజికల్‌ సర్వే వెల్లడించింది. భూకంపం తీవ్రత అధికంగా ఉండటంతో లోంబక్ ప్రాంతంలోని ప్రజలు భయాందోళలకు గురయ్యారు.భయంతో ఇళ్లలో నుంచి బయటికి పరుగులు తీశారు.

రెండు వారాల క్రితం ఇండోనేషియాలో భారీ భూకంపం సంభవించి 460 మంది మరణించిన సంగతి తెలిసిందే. ‘ఇప్పటికే భూకంపం బారిన పడిన బాధితులకు సరకులు తీసుకెళ్తోన్న సమయంలో ఒక్కసారిగా విద్యుత్ స్తంభం ఊగిసలాడటం కనిపించింది. దీంతో మళ్లీ భూకంపం వచ్చిందని అర్థమైంది’ అని ఓ స్థానికుడు వెల్లడించారు. లోంబక్‌ రాజధాని మతారమ్, బాలి ద్వీపంలో కూడా దీని ప్రభావం కనిపించింది.

మరిన్ని వార్తలు