ఏషియన్‌ గేమ్స్‌: ఇండోనేషియాలో భూకంపం

28 Aug, 2018 15:08 IST|Sakshi
భూకంప దాటికి స్వల్పంగా దెబ్బతిన్న ఇళ్లు

జకార్త: ఏషియన్‌ గేమ్స్‌ ఆతిథ్య దేశం ఇండోనేషియాలో మంగళవారం భూకంపం సంభవించింది. అయితే ఈ భూకంప దాటికి ఎలాంటి ప్రమాదాలు, ప్రాణనష్టం జరగలేదు. సునామీ వచ్చే అవకాశం కూడా లేదని, భూకంప తీవ్రత రిక్టర్‌ స్కేల్‌పై 6.2 గా నమోదైందని యూఎస్‌ జియోలాజికల్‌ సర్వే పేర్కొంది. ఈ భూకంప దాటికి 18వ ఏషియా గేమ్స్‌ జరుగుతున్న జకార్త, పలేంబాగ్‌ ప్రాంతాల్లోతో పాటు  టీమర్‌ ఐస్లాండ్‌, కుపాంగ్‌ల్లో భూమి కొంతమేర కంపించింది. ఇటీవల లంబోక్‌ దీవుల్లో సంభవించిన భూకంప తీవ్రతకు 80 మందికి పైగా మృతి చెందగా, వేలాది పౌరులు తీవ్ర గాయలపాలయ్యారు. ఈ ఏడాది వరుసగా సంభవించిన భూకంపాలతో ఇండోనేషియాలో సుమారు 500 మంది ప్రాణాలు కోల్పోయినట్లు అక్కడి అధికారులు పేర్కొన్నారు.

>
మరిన్ని వార్తలు