సునామీ హెచ్చరికలు జారీ చేసిన అధికారులు

15 May, 2019 08:55 IST|Sakshi

పోర్ట్‌ మోర్స్‌బై : సరిగ్గా ఓ వారం రోజుల గడిచాయో లేదో పపువా న్యూగినియా దేశంలో మరోసారి భారీ భూకంపం సంభవించింది. రిక్టర్‌ స్కేల్‌పై దీని తీవ్రత 7.5గా నమోదైంది. మంగళవారం రాబౌల్‌ నగరంలో ఈ భూకంపం చోటు చేసుకుంది. భూకంప తీవ్రత ఎక్కువగా ఉండటంతో పసిఫిక్‌ సునామీ హెచ్చరికల కేంద్రం సునామీ వచ్చే అవకాశం ఉన్నట్లు హెచ్చరికలు కూడా జారీ చేసింది. న్యూ బ్రిటెయిన్ ప్రాంతంలోని పపువా న్యూగినియా దీవిలో తూర్పు రాబౌల్‌కి 50 కిలో మీటర్ల దూరంలో ఈ భూకంపం కేంద్రీకృతమై ఉందని అమెరికా జియోలాజికల్‌ సర్వే విభాగం పేర్కొంది. అయితే,  భూకంపం వల్ల ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం సంభవించలేదని ఆ దేశ అధికార వర్గాలు వెల్లడించాయి.

గత మంగళవారం వచ్చిన భూకంప తీవ్రత కన్నా.. ఈ సారి సంభవించిన భూకంప తీవ్రత ఎక్కువగా ఉండటంతో సునామీ హెచ్చరికలు కూడా జారీ చేశారు. అలాగే భూకంప ప్రభావానికి సంబంధించి ఇప్పటి వరకు తమకు పూర్తి సమాచారం లేదని, పరిస్థితిని ఇంకా అంచనా వేస్తున్నామని రాబౌల్‌ పోలీస్‌ స్టేషన్‌ కమాండర్‌ తెలిపారు.

మరిన్ని వార్తలు