నేపాల్‌లో కంపించిన భూమి

13 May, 2020 08:16 IST|Sakshi

ఖాట్మాండు: మన పొరుగు దేశం నేపాల్‌లో మంగళవారం అర్ధరాత్రి భూకంపం సంభవించింది. భూకంపన తీవ్రత రిక్టర్‌ స్కేలుపై 5.3గా నమోదయినట్టు నేపాల్‌ సిస్మోలాజికల్‌ సెంటర్‌ వెల్లడించింది. మంగళవారం రాత్రి 11.53 గంటల సమయంలో పలు ప్రాంతాల్లో భూమి కంపించింది. డొలాకా జిల్లాలోని జుగు ప్రాంతంలో భూకంపన కేంద్రాన్ని గుర్తించారు. దీని ప్రభావంతో ఖాట్మాండు, కాస్కీ, పర్సా, సింధుపల్‌చోక్‌ తదితరా ప్రాంతాల్లో భూకంపనాలు సంభవించాయని ‘హిమాలయన్‌ టైమ్స్‌’ పేర్కొంది. అయితే భూకంపం ధాటికి ఎవరు గాయపడినట్టు, చనిపోయినట్టు, ఆస్తి నష్టం సంభవించినట్టు వెంటనే సమాచారం లేదు. నేపాల్‌ సరిహద్దులోని భారత్‌ ప్రాంతంలోనూ భూకంపనాలు సంభవించలేదని సమాచారం. (అసత్య ప్రచారంపై ప్రపంచాస్త్రం)

మరిన్ని వార్తలు