అప్పట్లో 18 గంటలే!

6 Jun, 2018 02:01 IST|Sakshi

వాషింగ్టన్‌: చంద్రుడు భూమికి దూరమయ్యే కొద్దీ రోజు సమయం పెరుగుతోందని ఓ అధ్యయనంలో తేలింది. దాదాపు 140 కోట్ల సంవత్సరాల క్రితం భూమిపై ఒకరోజుకు కేవలం 18 గంటలే ఉండేవని యూనివర్సిటీ ఆఫ్‌ విస్కాన్సిన్‌–మాడిసన్‌కు చెందిన ప్రొ.స్టీఫెన్‌ మేయర్స్‌ తెలిపారు. కాలక్రమేణా చంద్రుడు భూమికి దూరంగా జరగడంతో భూమి ఆత్మభ్రమణ వేగం తగ్గిందని వెల్లడించారు.

ఖగోళశాస్త్రం, భూమి గురించి సంయుక్తంగా అధ్యయనం చేసే ఆస్ట్ర్రోకోనాలజీ అనే విధానం ఆధారంగా పురాతనమైన రాతిపొరల రికార్డుల్ని పరిశీలించి ఈ విషయాన్ని నిర్ధారించినట్లు పేర్కొన్నారు. ఇందులోభాగంగా ఉత్తర చైనాలో లభ్యమైన 140 కోట్ల సంవత్సరాల ప్రాచీనమైన రాతిపోరతో పాటు దక్షిణ అట్లాంటిక్‌ మహాసముద్రంలో గుర్తించిన 5.5 కోట్ల సంవత్సరాల రాతిపొరల నివేదికల్ని శాస్త్రవేత్తలు పరిశీలించారు. సౌరకుటుంబంలో భూమి గమనాన్ని సూర్యుడు, చంద్రుడితో పాటు ఇతర గ్రహాలు గణనీయంగా ప్రభావితం చేశాయని మేయర్స్‌ తెలిపారు.

మరిన్ని వార్తలు