పాలకూర తింటే క్రీడల్లో రాణించొచ్చు!

7 Oct, 2016 10:45 IST|Sakshi
పాలకూర తింటే క్రీడల్లో రాణించొచ్చు!

లండన్: మీ పిల్లల్ని మంచి క్రీడాకారులుగా తయారు చేయాలనుకుంటున్నారా? బరిలోకి దిగితే దుమ్మురేపాలని కోరుకుంటున్నారా? అయితే ఇప్పటి నుంచే పాలకూరను ఎక్కువగా తినిపించడం అలవాటు చేయండి. ఎందుకంటే ఆటలాడినప్పుడు శరీరంలో ఆక్సిజన్ శాతం తగ్గి.. అలసిపోతారు. అయితే పాలకూర ఎక్కువగా తినేవారు ఆక్సిజన్ తక్కువగా ఉన్న సమయంలో కూడా అద్భుతమైన ప్రదర్శనను కనబరుస్తారట. ఇందుకు కారణం పాలకూరలో అధిక మోతాదులో ఉండే నైట్రేటే కారణమంటున్నారు బెల్జియంలోని లీవెన్ యూనివర్సిటీ పరిశోధకులు.

ఇందుకోసం 27 మంది క్రీడాకారులపై వారం రోజులపాటు శాస్త్రవేత్తలు పరిశోధన చేశారు. కూర్చున్నప్పుడు, సైక్లింగ్‌ వంటి వ్యాయామాలు చేసేటప్పుడు నైట్రేట్‌ పనితీరును పరిశీలించారు. వారిలో నైట్రేట్‌ తీసుకున్నవారి కండరాల్లో అద్భుతమైన పటుత్వం వచ్చినట్లు గుర్తించారు. సహజ పద్ధతుల్లో నైట్రేట్‌ శరీరానికి అందించడానికి అత్యుత్తమ మార్గం పాలకూర తినిపించడమేనని యూనివర్సిటీ ప్రొఫెసర్‌ పీటర్‌ హెస్పెల్‌ తెలిపారు. ముఖ్యంగా క్రీడాకారుల విషయంలో ఈ పద్ధతి ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు.

మరిన్ని వార్తలు