తెలివైన పిల్లలు కావాలంటే పండ్లు తినాల్సిందే

27 May, 2016 11:01 IST|Sakshi
తెలివైన పిల్లలు కావాలంటే పండ్లు తినాల్సిందే

టొరంటో: తల్లి కాబోయే వనితలారా వినండి! గర్భిణిగా ఉన్నప్పుడు పళ్లు ఎంత ఎక్కువగా తింటే, పిల్లలు అంత తెలివైన వాళ్లుగా పుడతారట. రోజుకు సగటును ఆరేడు పళ్లు తింటే జన్మించబోయే శిశువు ఐక్యూ (ఇంటెలిజెన్స్ కోషెన్సీ) స్థాయులు ఐదారు పాయింట్లు ఎక్కువగా ఉంటాయని పరిశోధనల్లో తేలింది.

కెనడాకు చెందిన 688 మంది చిన్నారుల సమాచారాన్ని విశ్లేషించి యూనివర్సిటీ ఆఫ్ అల్బెర్టా ఈ విషయాన్ని నిర్ధారించింది. ఇలాంటి పిల్లల్లో జ్ఞాపకశక్తి కూడా అధికంగా ఉంటుందని పరిశోధనకు నేతృత్వం వహించిన పీయుష్ మదానే చెప్పారు. గర్భిణి పళ్లు తిన్నప్పుడు శిశువు మెదడులో ఐక్యూ స్థాయులను పెంచే జన్యువులు ఎక్కువగా అభివృద్ధి చెందుతున్నట్టు గుర్తించామని మదానే వివరించారు.

మరిన్ని వార్తలు