ఈఫిల్‌ టవర్‌ మూసివేత

9 Feb, 2018 20:26 IST|Sakshi
ఈఫిల్‌ టవర్‌ (ఫైల్‌ ఫోటో)

శుక్రవారం, శనివారం సందర్శన నిలిపివేత

ఫ్రాన్స్‌ : పారిస్‌ అనగానే మనకు ముందుగా గుర్తుకువచ్చేది ఈఫిల్‌ టవర్‌. ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్టాత్మక నిర్మాణాల్లో ఒకటైన ఈఫిల్‌ టవర్‌ను సందర్శించటానికి దేశ విదేశాల నుంచి భారీ ఎత్తున్న పర్యాటకులు తరలివస్తుంటారు. కానీ పారిస్ సందర్శకులకు ఓ చేదువార్త. శుక్రవారం, శనివారం రెండు రోజులు ఈఫిల్ టవర్ సందర్శనకు పర్యాటకులను అధికారులు అనుమతించడం లేదు. 

గత నెలలో కురిసిన భారీ వర్షాల నుంచి తేరుకోకముందే..  గత రెండు రోజులుగా దట్టమైన పొగ మంచు పారిస్ నగరవాసులను  ఇబ్బందులకు గురిచేస్తోంది. శుక్రవారం మరింతగా మంచు కురిసే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో ముందస్తు జాగ్రత్తగా అధికారులు సందర్శనను నిలిపివేస్తున్నట్టు ప్రకటించారు. పొగ మంచు దట్టంగా కమ్ముకుపోవడంతో అక్కడ రవాణ వ్యవస్థ స్తంభించిపోయింది. వందల కొద్దీ వాహనదారులు రోడ్లపైనే జాగరం చేయాల్సి వచ్చింది. రైల్వే వ్యవస్థకు కూడా అంతరాయం కలగడంతో, 700 మందికి పైగా ప్రయాణికులు స్టేషన్లలోనే నిద్రించాల్సి వచ్చింది. ఓర్లీలో కొన్ని విమానాలు రద్దయ్యాయని తెలిసింది. మరింత పొగమంచు సంకేతాలు వస్తుండటంతో, దేశంలో ఈ క్వార్టర్‌లో అత్యంత దారుణమైన పరిస్థితి ఏర్పడుతుందని ముందస్తుగా ప్రజలకు అధికారులు హెచ్చరికలు జారీచేస్తున్నారు.
 

మరిన్ని వార్తలు