చీకట్లో ఈఫిల్‌ టవర్‌

3 Oct, 2017 13:06 IST|Sakshi

లాస్‌వేగాస్‌ మృతులకు నివాళిగా..

పారిస్‌ : లాస్‌వేగాస్‌ కాల్పుల దుర్ఘటనలో మృతిచెందిన వారికి నివాళిగా పారిస్‌లోని ఈఫిల్‌ టవర్‌లో సోమవారం రాత్రి విద్యుత్‌​ దీపాలను వెలిగించలేదు. ఉగ్రవాద వికృత క్రీడలో 59 మంది మరణించగా.. వందలాది మంది తీవ్ర గాయాల పాలయ్యారు. అమెరికా చరిత్రలోనే అది అత్యంత దారుణమైన దుర్ఘటన. ఇదిలా ఉండగా ఆదివారం ఉదయం ఫ్రాన్స్‌లోని మార్షిల్లే రైల్వే స్టేషనల్‌లో ఇద్దరి వ్యక్తులను ఇస్లామిక్‌ తీవ్రవాదులు హతమార్చిన విషయం తెలిసిందే.  ఈ రెండు ఘటలనలను తామే చేసినట్లు ఇస్లామిక్‌ స్టేట్‌ ప్రకటించుకుంది. మార్షిల్లే,  లాస్‌వేగాస్‌ మృతులకు నివాళిగా.. ఈఫిల్‌ టవర్‌లోని విద్యుత్‌ దీపాలను వెలిగించడం లేదని ప్రభుత్వం తెలిపింది.

మరిన్ని వార్తలు