ఐన్‌స్టీన్‌ సిద్ధాంతమే నిజం..!

6 Jul, 2018 03:13 IST|Sakshi

వాషింగ్టన్‌: ఆల్బర్ట్‌ ఐన్‌స్టీన్‌ ప్రతిపాదించిన గురుత్వాకర్షణ సిద్ధాంతం ప్రతికూల సంద ర్భాల్లో కూడా నిజమేనని నిరూపితమైందని తాజా అధ్యయనంలో వెల్లడైంది. ఐన్‌స్టీన్‌ గురుత్వాకర్షణ సిద్ధాంతం ప్రకారం బరువుతో సంబంధం లేకుండా విశ్వంలోని ఏ వస్తువైనా ఒకే సమయంలో కిందకు పడిపోతుంది. అయి తే ఐన్‌స్టీన్‌ సిద్ధాంతాన్ని వ్యతిరేకించే సిద్ధాంతా లు మాత్రం తక్కువ బరువున్న వాటితో పోలిస్తే.. అధిక గురుత్వాకర్షణ శక్తి ఉండే న్యూట్రాన్‌ స్టార్‌ కిందకు పడే సమయాల్లో తేడా లుంటాయని పేర్కొన్నాయి.

కానీ ఇప్పుడు ఐన్‌స్టీన్‌ సిద్ధాంతమే మరోసారి నిజమని నిరూపితమైనట్లు అమెరికాలోని గ్రీన్‌బ్యాంక్‌ అబ్జర్వేటరీ పరిశోధకులు చెప్పారు. నేషనల్‌ సైన్స్‌ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలోని గ్రీన్‌ బ్యాంక్‌ టెలిస్కోప్‌ భూమికి 4,200 కాంతి సంవత్సరా ల దూరంలో ఉన్న ట్రిపుల్‌ స్టార్‌ సిస్టమ్‌ను 2011లో కనుగొంది. ఈ వ్యవస్థలో న్యూట్రాన్‌ నక్షత్రం, రెండు మరుగుజ్జు నక్షత్రాలున్నాయి. ఈ న్యూట్రాన్‌ స్టార్‌ కన్నా లోపలి తెలుపు రంగు మరుగుజ్జు నక్షత్రం తక్కువ బరువుతో ఉంది. ఇతర పరిశోధకుల సిద్ధాంతా లే నిజమైతే.. న్యూట్రాన్‌ స్టార్, లోపలి తెలుపు రంగు నక్షత్రం వేర్వేరు సమయాల్లో కిందకు పడిపోవాల్సి ఉందని, కానీ అలా జరగలేదని చెప్పారు.

మరిన్ని వార్తలు