గుండెను పిండేస్తున్న విషాద చిత్రం

27 Aug, 2016 11:34 IST|Sakshi
గుండెను పిండేస్తున్న విషాద చిత్రం

న్యూయార్క్: వివాహం చేసుకునే సమయంలోనే జీవితాంతం కలిసుండాలని ఆ నూతన దంపతులతో ప్రమాణం చేయిస్తారు. విడాకులప్పుడు.. అనూహ్య మరణం సమయంలో మాత్రమే ఈ ప్రమాణానికి ప్రాణం పోతుంది. ఆ సమయంలో కూడా ఆ రెండు గుండెల్లో ఏదో ఒకటి నీరుగారుస్తుంది. కానీ, పైన పేర్కొన్న రెండు సంఘటనలు లేకుండానే దాదాపు దశాబ్దాలుగా కలిసుంటున్న భార్యాభర్తలు విధి ఆడిన వింత ఆటతో దూరం కావాల్సి వస్తే.. ఏక్షణం కన్నుమూస్తారో తెలియని వయసుకొచ్చేసరికి వారిద్దరిని వేర్వేరు చేసి ఉంచాల్సి వస్తే.. ఆ వృద్ధ దంపతుల బాధను ఎవరైనా అంచనా వేయగలరా.. ఈ సంఘటన లండన్ లో చోటుచేసుకుంది. వాల్ఫ్రమ్ గోట్స్ చాక్(83), అనిత(81) అనే వాళ్లు ఓ వృద్ధ దంపతులు. వారిద్దరు జర్మనీలో 1954లో కలుసుకున్నారు.

అనంతరం వివాహం చేసుకున్నారు. అక్కడి నుంచి కెనడాకు వలస వెళ్లారు. దాదాపు 60 ఏళ్లుగా కలిసి ఉంటున్న ఆ భార్యభర్తల కడసారి జీవితంలో అనూహ్య మార్పులు చోటుచేసుకున్నాయి. వాల్ఫ్రర్ కు మతి మరుపు జబ్బు వచ్చింది. పిచ్చిపిచ్చిగా ప్రవర్తించడం మొదలుపెట్టాడు. దీంతో అతడిని తన భార్య నుంచి వేరు చేసి వేరే ప్రత్యేక నర్సింగ్ హోమ్ కు తరలించి చికిత్స అందించాల్సి వచ్చింది. భార్య అనితకు క్యాన్సర్ లాంటి జబ్బు చేసింది. దీంతో కొద్ది రోజుల తర్వాత ఆమెను కూడా వేరే ఆస్పత్రిలో చేర్పించాల్సిన పనిలేదు.

ఈ మధ్య ఓ అరగంటపాటు వారిద్దరిని కలిపేందుకు వాల్ప్రమ్ ఉంటున్న కేర్ హోమ్ కు తీసుకెళ్లగా వారిద్దరి మధ్య భావోద్వేగమైన క్షణాలు ఆవిష్కృతమయ్యాయి. వారిద్దరు ఒకరి చేతిలో ఒకరి చేయి వేసుకొని కంటతడిపెట్టారు. దానికి సంబంధించిన ఫొటోను వారి మనవరాలు తీసి ఆన్ లైన్లో పెట్టగా అంతర్జాతీయ దృష్టి పడింది. ప్రస్తుతం వారిద్దరిని ఒకే చోట చేర్చి వైద్యం ఇప్పించే అవకాశం ఉన్న చోటుకోసం వెతుకుతున్నారు.

మరిన్ని వార్తలు