సముద్రపు నీటితో విద్యుత్

23 May, 2016 01:44 IST|Sakshi
సముద్రపు నీటితో విద్యుత్

టోక్యో: సముద్రపు నీటి నుంచి విద్యుత్‌ను ఉత్పత్తి చేసేందుకు తోడ్పడే సరికొత్త టెక్నాలజీని జపాన్లోని ఒసాకా వర్సిటీ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. సూర్యరశ్మి సహాయంతో సముద్రపు నీటిని హైడ్రోజన్ పెరాక్సైడ్(ఏ2ై2)గా మార్చగలిగే ‘ఫొటో ఎలక్ట్రో కెమికల్ సెల్’ను రూపొందించారు. ఈ సెల్ సౌరశక్తిని గ్రహించినప్పుడు సముద్రపు నీటిలోని క్లోరిన్ సహాయంతో ఉత్తేజితమై... రసాయన చర్యలు జరుపుతుంది.

దీంతో నీటిలో కొంత భాగం హైడ్రోజన్ పెరాక్సైడ్‌గా మారుతుంది. ఈ హైడ్రోజన్ పెరాక్సైడ్‌ను ఫ్యూయల్ సెల్‌లో వినియోగించి విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తారు. అయితే ఇంకా ఇది ప్రాథమిక దశలోనే ఉందని, మరింతగా మెరుగుపరిచి ఎక్కువ స్థాయిలో హైడ్రోజన్ పెరాక్సైడ్ ఉత్పత్తి చేసేందుకు ప్రయత్నిస్తున్నామని పరిశోధనకు నేతృత్వం వహించిన శాస్త్రవేత్త షునిచి ఫుకుజుమి తెలిపారు.

>
మరిన్ని వార్తలు