యుగాంతం కథ ఏంటి?

20 Mar, 2020 17:01 IST|Sakshi

అసలే కరోనాతో ఓ వైపు ప్రపంచం గజగజవణికిపోతుంటే ఏప్రిల్‌ 19న ప్రపంచం కనుమరుగవుతోందని పిడుగు లాంటి మరో వార్త సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. అంతరిక్షం నుంచి వస్తున్న ఓ పెద్ద గ్రహశకలం భూమి నుంచి దూసుకెళ్తుందని, అప్పుడు యుగాంతం తప్పదని అంటున్నారు. అయితే దీంట్లో వాస్తవమెంత..? ఇప్పుడే ఈ ప్రచారం ఎందుకు తెరపైకి వచ్చిందని అంతా చర్చించుకుంటున్నారు. 2020 సంవత్సరంలో ఓ భారీ గ్రహ శకలం భూమికి సమీపంగా వెళ్తుందని మూడేళ్ల క్రితం నాసా ప్రకటించిన సంగతి తెలిసిందే.

అయితే అదే విషయాన్ని పట్టుకొని ఇప్పుడు కొంత మంది భూమి అంతం కాబోతోందని ప్రచారం చేస్తున్నారు. నిజానికి 2వేల అడుగుల పరిమాణం ఉన్న జేఓ25 అనే గ్రహశకలం భూమి నుంచి 1.8 మిలియన్‌ కిలోమీటర్ల దూరంలో దూసుకెళ్లనుందని నాసా పేర్కొంది. ఇది చంద్రుడి నుంచి భూమికి గల మధ్య దూరానికి 4.6 రెట్లు దూరంలో పయనించనుంది. కనుక భూమిని తాకే అవకాశమే లేదని నాసా స్పష్టం చేసింది. ఈ ప్రక్రియ కారణంగా ఎటువంటి ప్రమాదం లేదని , వదంతులు నమ్మవద్దని సూచించింది. చదవండి: ఆస్టరాయిడ్‌ సమీపానికి నాసా నౌక

2004 సెప్టెంబర్‌లో టౌటాటిస్‌ అనే గ్రహశకలం భూమి నుంచి 4 లూనార్లతో దూసుకెళ్లింది. అయితే ఏప్రిల్‌ 19న భూమిని సమీపించబోయే గ్రహశకలం అంతకంటే పెద్దదని తెలుస్తోంది. కావాలనుకుంటే భూమి నుంచి దూరంగా వెళ్లే క్రమంలో రాత్రివేళ టెలిస్కోపు సాయంతో ఈ గ్రహశకలాన్ని చూడవచ్చని కూడా తెలిపింది. కాగా.. గడిచిన 400ఏళ్లలో కానీ.. రాబోయే మరో 500 ఏళ్లలో కానీ భూమికి ఇంత సమీపంలోకి రానున్న గ్రహశకలం మరేది ఉండబోదని మాత్రం నాసా స్పష్టం చేసింది.

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా