ఇక మొబైల్లకు వైర్లెస్ చార్జింగ్!

4 Jun, 2016 09:59 IST|Sakshi
ఇక మొబైల్లకు వైర్లెస్ చార్జింగ్!

ఎంత ఖరీదైన మొబైల్ కొనుగోలు చేసినా చార్జింగ్ విషయం మాత్రం వినియోగదారులకు ఎప్పుడూ సమస్యగానే మిగిలిపోయింది. అయితే దీనిని పరిష్కరించే దిశగా కొత్త చార్జింగ్ టెక్నాలజీ అందుబాటులోకి వస్తోంది. ఎనర్జీస్క్వేర్ పేరుతో మార్కెట్లోకి రాబోతున్న వైర్లెస్ చార్జింగ్ టెక్నాలజీ ద్వారా అన్ని స్మార్ట్ ఫోన్లతో పాటు.. ట్యాబ్లను కూడా ఈజీగా చార్జ్ చేసుకోవచ్చు.

ఎనర్జీస్క్వేర్లో ఓ వైర్లెస్ చార్జింగ్ మ్యాట్తో పాటు ఓ చిన్న స్టిక్కర్ ఉంటుంది. మొబైల్కు అంటుకునే లాగా డిజైన్ చేసిన ఈ స్టిక్కర్ను చార్జింగ్ సాకెట్లో ఉంచి ఫోన్ను.. మ్యాట్పై ఉంచితే చాలు చార్జింగ్ అవుతోంది. ఇందులో ఇప్పటివరకు చార్జింగ్ కోసం వాడుతున్న  ఇండక్షన్, ఎలక్ట్రో మేగ్నటిక్ టెక్నాటజీని కాకుండా కండక్టీవ్ చార్జింగ్ టెక్నాలజీని ఉపయోగించారు. ఒకే చార్జింగ్ ప్యాడ్ సహాయంతో నాలుగైదు ఫోన్లను సైతం ఒకేసారి చార్జింగ్ చేసుకోవచ్చు.

గత ఐదేళ్లలో తయారుచేసిన ఏ స్మార్ట్ఫోన్ అయినా ఈ చార్జింగ్ టెక్నాలజీని సపోర్ట్ చేస్తుంది. స్టిక్కర్లలో ఉండే రెండు కండక్టీవ్ డాట్స్ సహాయంతో నేరుగా మొబైల్ బ్యాటరీకి లింక్ అయ్యేలా దీనిని రూపొందించారు. చార్జింగ్ మ్యాట్తో పాటు నాలుగు స్టిక్కర్లను కస్టమర్లకు ఇవ్వనున్నట్లు ఎనర్జీస్క్వేర్ వెల్లడించింది. అయితే ఇవి వచ్చే నెలలో మార్కెట్లోకి రానున్నట్లు తెలుస్తోంది.


 

>
మరిన్ని వార్తలు