కరోనా కలకలం : యూరప్‌ లాక్‌డౌన్‌

17 Mar, 2020 08:21 IST|Sakshi

లండన్‌ : కరోనా వైరస్‌ వ్యాప్తితో యావత్‌ ప్రపంచం చివురుటాకులా వణుకుతోంది. ఫ్రాన్స్‌ లాక్‌డౌన్‌ ప్రకటించగా, మహమ్మారి వ్యాప్తిని అడ్డుకునేందుకు యూరప్‌ తన సరిహద్దులను మూసివేసింది. విదేశీయులు ఎవరూ అడుగుపెట్టకుండా 30 రోజుల పాటు సరిహద్దులను మూసివేయాలని యూరప్‌ నిర్ణయించింది. అయితే ఇటలీలో కరోనా మృతులు 1800 దాటడం, కొత్త కేసులు వేగంగా పెరుగుతుండటంతో ముందస్తు చర్యల్లో విఫలమైందని విమర్శలు వెల్లువెత్తాయి. మరోవైపు అమెరికాలోనూ కొవిడ్‌ 19 వ్యాప్తితో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. మహమ్మారి వైరస్‌పై నెలల తరబడి పోరాటం సాగించాల్సి ఉందని అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ హెచ్చరించారు. అమెరికాలో పలు ప్రాంతాల్లో కర్ఫ్యూ విధించారు. ఫిలిప్పీన్స్‌లో ఫైనాన్షియల్‌ మార్కెట్లను నిలిపివేశారు. మరోవైపు భారత్‌లోనూ కరోనా వైరస్‌ కేసుల సంఖ్య 125 దాటడం​ ఆందోళన రేకెత్తిస్తోంది. 

చదవండి : ‘వైరస్‌’ మోసుకొస్తున్నారు!

>
మరిన్ని వార్తలు