ఎవరెస్ట్ వేడెక్కుతోంది!

8 Dec, 2015 01:56 IST|Sakshi
ఎవరెస్ట్ వేడెక్కుతోంది!

పర్వత ప్రాంతాల్లో పెరుగుతున్న ఉష్ణోగ్రతలు
 
 బీజింగ్: ఎవరెస్ట్ పర్వతం వద్ద ఉష్ణోగ్రతలు గత 50 సంవత్సరాలుగా పెరుగుతున్నాయని తాజాగా చైనా చేపట్టిన ఓ అధ్యయనంలో తేలింది. ఎవరెస్ట్ చుట్టూతా వ్యాపించి ఉన్న హిమనీనదాలు వేడిమి కారణంగా కుచించుకుపోతున్నాయని చైనీస్ అకాడమీ ఆఫ్ సైన్స్, హునాన్ వర్సిటీ ఆఫ్ సైన్స్, టెక్నాలజీ, మౌంట్ కోమోలాంగ్మా స్నో లెపర్డ్ కన్జర్వేషన్ సెంటర్‌లు సంయుక్తంగా విడుదల చేసిన నివేదిక పేర్కొంది. అయితే, ఎవరెస్ట్ సమీపంలోని అటవీ విస్తీర్ణం కాస్తంత పెరగడంతో జీవావరణ పరిస్థితులు మెరుగుపడ్డాయని నివేదిక తేల్చింది. ఈ నివేదికను ఇటీవల టిబెట్ పీఠభూమి పరిశోధనా సంస్థ విడుదలచేసింది.

ఎవరెస్ట్ దగ్గరి హిమనీనదాలు వేడెక్కితే అక్కడ ప్రవాహం పెరిగి నదులు ఉప్పొంగుతాయని నివేదిక పేర్కొంది. టిబెట్ పీఠభూమిలో హిమనీనదాలు 20వ శతాబ్దంలో కుచించుకుపోయాయని, 1990ల నుంచి మరింత పెరిగిందని తెలిపింది. పర్వత ప్రాంతాల్లో మానవుని కార్యకలాపాలు, ఉష్ణోగ్రతలు హెచ్చడం ఇందుకు ప్రధాన కారణాలని వెల్లడించింది.

మరిన్ని వార్తలు