జనాభా తగ్గింది ఇందువల్లే!

20 Sep, 2016 02:45 IST|Sakshi
జనాభా తగ్గింది ఇందువల్లే!

టోక్యో: జపాన్‌లో ఒంటరిగా ఉంటున్న యువతలో 40 శాతం మందికి శృంగారానుభవం లేదని ప్రభుత్వ సర్వేలో తేలింది. సర్వే ప్రకారం.. నాలుగింట మూడువంతుల మంది పురుషులు ఒంటరిగా నివసిస్తున్నారు. జపాన్‌లో జననాల రేటు తగ్గిపోవడానికి ఇదే కారణమని అధికారులు కంగారు పడుతున్నారు. ఈ పరిస్థితి ఇలానే కొనసాగితే  జపాన్ వృద్ధ దేశం అయిపోతుందని అంటున్నారు. 2015 జూన్‌లో జరిగిన ఈ  సర్వేలో జాతీయ జనాభా సంస్థ, సామాజిక భద్రతా పరిశోధనా విభాగాలు 18-34 ఏళ్ల మధ్య 5వేల మందికి పైబడిన వారిని ప్రశ్నించాయి.

పురుషుల్లో 42 శాతం మంది, స్త్రీల్లో 44 శాతం మందికి ఇంతవరకు శృంగారానుభవం లేదని ఈ సర్వే చెబుతోంది. ఇంతకుముందు 2005లో జరిగిన ఇలాంటి సర్వేలోనే  30 శాతం మందే ఒంటరిగా ఉన్నారని తేలింది. 2015లో జరిగిన సర్వేలో పురుషుల్లో 70 శాతం మంది, స్త్రీల్లో 60 శాతం మంది ఒంటరిగా ఉంటున్నారని తేలింది.

మరిన్ని వార్తలు