భర్తను కత్తి పొడిచి.. పేగులు బయటకు తీయాలని..

22 Jun, 2016 19:38 IST|Sakshi
మాజీ భర్తను కత్తితో పొడిచి పేగులు బయటకు తీయాలని ప్రయత్నించిన కేసును బుధవారం బ్రిటన్ కోర్టు విచారించింది. వాదోపవాదనల సందర్భంగా బాధితుడు బిలాల్ మహమ్మద్ తన మాజీ భార్య ఆయనను కత్తితో పొడిచి పేగులు బయటకు తీసేందుకు యత్నించిందని ఆరోపించారు. దీనిపై స్పందించిన బిలాల్ మాజీ భార్య దాల్యా సయీద్ అతన్ని చంపడానికి ప్రయత్నించినట్లు చేసిన వ్యాఖ్యలను ఖండించింది. బిలాల్ తనను రేప్ చేశాడని ఆత్మరక్షణ కోసం అతన్ని పొడవాల్సివచ్చినట్లు కోర్టు జ్యూరీకి తెలిపింది.
 
పాకిస్తాన్ కు చెందిన బిలాల్ మహమ్మద్ చదువుకోవడానికి బ్రిటన్ వచ్చి ఓ రెస్టారెంట్ లో పనిచేసేవాడు. అతన్ని రెస్టారెంట్ లో చూసిన దల్యా ప్రేమించి వివాహం చేసుకుంది. వీరిద్దరికి ఓ పాప కూడా ఉంది. కాగా, 2013లో ఇద్దరికి మనస్పర్దలు రావడంతో విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత బిలాల్ రెండో వివాహం కూడా చేసుకున్నాడు. దల్యా, బిలాల్ లకు జన్మించిన బిడ్డను బిలాల్ పాకిస్తాన్ కు తీసుకుని వెళ్తాడనే భయంతో దల్యా బిడ్డను ఎక్కడ ఉంచాలన్న విషయంపై చర్చించుకోవాలని బిలాల్ ను కోరింది. దీనిపై స్పందించిన బిలాల్ బర్మింహామ్ లోని తన నివాసానికి రావాలంటూ ఆమెను ఆహ్వానించాడు. 
 
ఇంట్లోకి వచ్చి రావడంతోనే దల్యా తనను కౌగిలించుకుని పెదవులు, మెడ, ఛాతీపై ముద్దుపెట్టుకుందని.. ఏం జరుగుతుందో తెలుసుకనే లోపే కత్తితో తన పొట్టలో రెండు మార్లు పొడిచినట్లు మహమ్మద్ జ్యూరీకి వివరించాడు. ఆమెను నవ్వేం చేశావ్? అని ప్రశ్నించగా తిరిగి మరోసారి పొడిచినట్లు తెలిపాడు. దీంతో ఆమె చేతిలో నుంచి కత్తిని లాక్కున్నట్లు చెప్పాడు. ఈ లోగా ఆమె తన పేగులను పట్టుకుని బయటకు లాగడానికి ప్రయత్నించినట్లు వెల్లడించాడు. దీంతో తాను కత్తిని సోఫా వెనుకకు విసేరేసి ఓ చేత్తో పొట్టను పట్టుకుని ప్రాణభయంతో ఇంట్లో బయటకు పరుగులు పెట్టడానికి ప్రయత్నించగా.. ప్రధాన ద్వారం వద్ద పట్టుకుని ముఖం మీద పెప్పర్ స్ప్రే చల్లినట్లు చెప్పాడు. చివరికి ఎలాగో వేరే ఫ్లాట్ లోకి పరుగెత్తి సాయం కోరి ప్రాణాలు కాపాడుకున్నట్లు వివరించాడు. కేసులో వాదోపవాదనలు విన్న జడ్జి తీర్పును వాయిదా వేశారు.
 
మరిన్ని వార్తలు