స్థూలకాయంతో మరిన్ని కేన్సర్లు

26 Aug, 2016 13:24 IST|Sakshi
స్థూలకాయంతో మరిన్ని కేన్సర్లు

వాషింగ్టన్: ఊబకాయంతో బాధపడుతున్నవారికి దుర్వార్త. అధిక బరువుతో ఇబ్బందిపడేవారికి ఇప్పటికే ఉన్న బాధలు చాలవన్నట్టు.. మరిన్ని కేన్సర్లు వచ్చే అవకాశముందని ఓ అధ్యయనం చెబుతోంది. పొట్ట, కాలేయం, పిత్తాశయం, క్లోమం, అండాశయం, మెనింగియోమా (ఒక రకం మెదడు కేన్సర్), థైరాయిడ్, రక్త కేన్సర్‌లు స్థూలకాయుల్ని బాధించే అవకాశం ఉంది. దీంతో గతంలో అనుకున్నదాని కంటే స్థూలకాయం మరింత ప్రమాదకరమని అధ్యయనకర్తలు చెబుతున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థకు చెందిన ఏజెన్సీ ఫర్ కేన్సర్ రీసెర్చ్ (ఐఏఆర్సీ) పరిశోధనలో ఈ విషయాలు వెల్లడయ్యాయి.

అధిక బరువు, కేన్సర్ ముప్పునకు సంబంధించి దాదాపు వెయ్యికి పైగా అధ్యయనాలను పరిశీలించిన తర్వాత అధ్యయన కర్తలు ఈ విషయాన్ని వెల్లడించారు. ప్రపంచవ్యాప్తంగా 64 కోట్లమంది పెద్దలు, 11 కోట్ల చిన్నారులు స్థూలకాయంతో బాధపడుతున్నట్టు పరిశోధనకు నేతృత్వం వహించిన గ్రాహం కాల్డిజ్ చెప్పారు. ‘‘స్థూలకాయం మనం ఊహించిన దానికంటే ప్రమాదకరమైనది. కొత్త కొత్త కేన్సర్లు దీనివల్లే పుట్టుకొస్తున్నాయి’’ అన్నారీయన.

మరిన్ని వార్తలు