జాగింగ్‌తో యంగ్‌ లుక్‌!

12 May, 2017 21:29 IST|Sakshi
జాగింగ్‌తో యంగ్‌ లుక్‌!

న్యూయార్క్‌:
కొందరు వయసు పైబడినా చాలా యంగ్‌గా కనిపిస్తారు. మరికొందరిలో మాత్రం పాతికేళ్లు నిండకుండానే వృద్ధాప్య ఛాయలు కనిపిస్తాయి. దీనికి కారణం టెలోమర్స్‌ అని చెబుతున్నారు శాస్త్రవేత్తలు. టెలోమర్స్‌ అనేవి క్రోమోజోములపైన ఉండే తొడుగులాంటి నిర్మాణాలు. క్రోమోజోములు క్షీణించకుండా ఇవి కాపాడతాయి. రక్షణ కల్పిస్తాయి.

అయితే టెలోమర్స్‌ బేస్‌పెయిర్స్‌ సంఖ్య ఎక్కువగా ఉన్నవారు చలాకీగా ఉన్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. ప్రతిరోజూ జాగింగ్‌ చేసేవారిలో ఈ బేస్‌ పెయిర్స్‌ ఎక్కువగా ఉన్నాయని, అందుకే రోజుకు 30 నుంచి 40 నిమిషాలు జాగింగ్‌ చేసేవారు యంగ్‌గా కనిపిస్తారని శాస్త్రవేత్తలు గుర్తించారు. మొత్తం 5,823 మందిపై పరిశోధన చేయగా.. అందులో నిత్యం అరగంటకుపైగా జాగింగ్‌ చేసేవారు చలాకీగా, యవ్వనంగా ఉన్నట్లు గుర్తించారు. అయితే జాగింగ్‌కు, టెలోమర్స్‌ బేస్‌ పాయింట్స్‌ ఎక్కువగా ఉండడానికి మధ్యగల సంబంధాన్ని గుర్తించాల్సి ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

>
మరిన్ని వార్తలు