ఇస్తాంబుల్‌లో భారీ ఆత్మాహుతి దాడి

12 Jan, 2016 18:51 IST|Sakshi
ఇస్తాంబుల్‌లో భారీ ఆత్మాహుతి దాడి

ఇస్తాంబుల్‌: ప్రఖ్యాత పర్యాటక ప్రాంతమైన టర్కీలోని ఇస్తాంబుల్‌ నగరంపై ఉగ్రవాదులు పంజా విసిరారు. ఇస్తాంబుల్‌లో మంగళవారం ఆత్మాహుతి దాడి జరుగడంతో 10 మంది మృతి చెందారు. 15 మంది గాయపడినట్టు సమాచారం. సెంట్రల్ ఇస్తాంబుల్‌లోని చారిత్రక సుల్తాన్హా మెట్ జిల్లాలోని ఓ కూడలి వద్ద సుసైడ్ బాంబర్ తనను తాను పేల్చుకున్నాడు. జనం రద్దీగా ఉన్న ప్రాంతంలో ఈ పేలుడు జరిగినట్టు తెలుస్తోంది.

దీంతో పోలీసులు వెంటనే ఈ ప్రాంతాన్ని తమ అధీనంలోకి తీసుకున్నారు. పేలుడు ప్రదేశానికి అంబులెన్సులు తరలించారు. టర్కీలో అత్యంత జనసమ్మర్ద నగరం ఇస్తాంబుల్. ఇక్కడ పర్యాటక ప్రసిద్ధ ప్రాంతంగా పేరొందిన బ్లూ మసీదు, హజియా సోఫియాకు సమీపంలో పేలుడు చోటుచేసుకుంది. పేలుడు ప్రాంతానికి సమీపంలో చారిత్రక స్మృతిచిహ్నమున్న పార్కు కూడా ఉందని స్థానిక టీవీ చానెళ్లు తెలిపాయి. ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు