సెకన్లలో విస్ఫోటకాలను గుర్తించవచ్చు!

24 May, 2016 01:53 IST|Sakshi
సెకన్లలో విస్ఫోటకాలను గుర్తించవచ్చు!

బోస్టన్: అతి తక్కువ సమయంలో విస్ఫోటక పదార్థాలను గుర్తించేందుకు శాస్త్రవేత్తలు ఒక కొత్త పద్ధతిని కనుగొన్నారు. ఈ కొత్త టెరాహెడ్జ్ స్పెక్ట్రోస్కోపీ విధానం ద్వారా 100 మైక్రో సెకండ్ల వ్యవధిలోపే పేలుడు పదార్థాలను గుర్తించవచ్చు. ఈ విధానాన్ని అమెరికాలో ని మాసాచూసెట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎంఐటీ) శాస్త్రవేత్తలు కనుగొన్నారు.

ఇదివరకు ఉపయోగించిన  విధానం ద్వారా పేలుడు పదార్థాలను గుర్తించేందుకు 15 నుంచి 30 నిమిషాల సమయం పట్టేది. కానీ ప్రస్తుత టెరాహెడ్జ్ స్పెక్ట్రోస్కోపీ విధా నం ద్వారా క్వాంటమ్ కాస్‌కేడ్ లేజర్ (అర్ధవాహక లేజర్)ను ఉపయోగించి సెక ండ్ల వ్యవధిలో విస్ఫోటాలను కనుగొనవచ్చు. ఇది కంప్యూటర్ చిప్ పరిమాణంలో ఉండడం మరింత కలిసొచ్చే అంశం.

మరిన్ని వార్తలు