వయసు తగ్గుతుందేమో కానీ..

30 Oct, 2015 16:33 IST|Sakshi
వయసు తగ్గుతుందేమో కానీ..

న్యూయార్క్: ఫేస్‌లిఫ్ట్ ఇప్పడు ప్రపంచవ్యాప్తంగా ఎంతో ఆదరణ పోందుతున్న కాస్మొటిక్ సర్జరీ. వయసు మీద పడుతున్నవారు యవ్వనంగా కన్పించాలనే తాపత్రయంతో ఎక్కువగా ఈ సర్జరీ మీద ఆధారపడుతున్నారు.  ఇటీవలి కాలంలో ఈ సర్జరీని ఆశ్రయించే వారి సంఖ్య పెరిగింది. ఫేస్‌లిఫ్ట్ సర్జరీ చేయించుకోవడం వల్ల వాస్తవానికి ఉన్న వయసు కంటే 10 సంవత్సరాలు తక్కువగా కన్పిస్తారని ప్రచారంలో ఉంది.


ఫేస్‌లిఫ్ట్ సర్జరీ వలన ముఖంలో వయసు తాలూకు చాయలు తగ్గుతాయేమో కానీ.. వారి ఆత్మవిశ్వాసం మాత్రం మెరుగుపడడం లేదని తాజాగా నిర్వహించిన సర్వేలో తేలింది. న్యూయార్క్కు చెందిన 'ఆండ్రూ జుకానో ఫేసియల్ అండ్ ప్లాస్టిక్ సర్జరీ' అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన సర్వేలో ఈ విషయం వెల్లడైంది.

 

సర్వేలో భాగంగా ఫేస్ లిఫ్టింగ్ సర్జరీ చేయించుకున్న పలువురి అభిప్రాయాలను సేకరించగా, వారిలో ఈ చికిత్స తర్వాత ఆత్మవిశ్వాసంలో ఎలాంటి పురోగతి కన్పించలేదని తెలిపింది. అంతే కాకుండా సర్జరీతో ప్రస్తుత వయసుకు దాదాపు 10 సంవత్సరాలు తక్కువగా కన్పిస్తున్నామని తెలిపిన వారు.. ఆ వయసులోని వారిలా ఆత్మవిశ్వాసాన్ని ప్రదర్శించడంలో మాత్రం వెనుకబడుతున్నామని తెలిపారు.

>
మరిన్ని వార్తలు