క్విజ్‌ యాప్‌లపై ఫేస్‌బుక్‌ నిషేధం

28 Apr, 2019 04:40 IST|Sakshi

పలు ఏపీఐల తొలగింపు

యూజర్ల డేటా సేకరించే యాప్‌లకు చెక్‌ పెట్టేందుకే..

శాన్‌ఫ్రాన్సిస్కో: యూజర్ల వ్యక్తిగత సమాచారాన్ని పరిరక్షించే దిశగా సోషల్‌మీడియా దిగ్గజం ఫేస్‌బుక్‌ కీలక నిర్ణయం తీసుకుంది. తమ ప్లాట్‌ఫామ్‌లో యూజర్ల వ్యక్తిత్వంపై క్విజ్‌లను నిర్వహించే యాప్‌లను నిషేధిస్తున్నామని తెలిపింది. యూజర్ల సమాచారాన్ని రహస్యంగా సేకరించేలా ఉన్న యాప్‌లకు చెక్‌ పెట్టేందుకు ఈ నిర్ణయం తీసుకున్నామని వెల్లడించింది. వీటితోపాటు పలు అప్లికేషన్‌ ప్రొగ్రామింగ్‌ ఇంటర్‌ఫేస్‌ల(ఏపీఐ)ను తొలగిస్తున్నామనీ, కంపెనీ విధానాలను ఎప్పటికప్పుడు అప్‌డేట్‌ చేస్తున్నామని ఫేస్‌బుక్‌ పేర్కొంది. కేంబ్రిడ్జి అనలిటికా అనే సంస్థ ఫేస్‌బుక్‌ నుంచి 8.7 కోట్ల మంది అమెరికన్ల వ్యక్తిగత సమాచారాన్ని తస్కరించిన సంగతి తెలిసిందే. 2016లో జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఈ సమాచారాన్ని వాడుకున్నట్లు తేలడంతో ఫేస్‌బుక్‌ పలు నష్టనివారణ చర్యలు చేపట్టింది.

మరిన్ని వార్తలు