త్వరలో ఫేస్‌బుక్‌ ‘డేటింగ్‌’

3 May, 2018 04:47 IST|Sakshi

శాన్‌జోస్‌: సామాజిక మాధ్యమం ఫేస్‌బుక్‌ త్వరలోనే తమ యూజర్ల కోసం వినూత్నమైన ఫీచర్‌ను తీసుకురానుంది. ఫేస్‌బుక్‌ యూజర్లు తమకు నచ్చే వ్యక్తిత్వం ఉన్నవారితో సుదీర్ఘకాలం సంబంధం కొనసాగించేందుకు ‘డేటింగ్‌’ అనే ఫీచర్‌ను ప్రవేశపెడుతున్నట్లు సంస్థ అధినేత మార్క్‌ జుకర్‌బర్గ్‌ ప్రకటించారు. మంగళవారం ఫేస్‌బుక్‌ ఎఫ్‌8 వార్షిక డెవలపర్ల సమావేశం కాలిఫోర్నియాలోని శాన్‌జోస్‌లో జరిగింది.

దీనిలో జుకర్‌బర్గ్‌ మాట్లాడుతూ.. తమ యూజర్లు నిజమైన, దీర్ఘకాలిక బంధాలను పొందేందుకు ఈ ఫీచర్‌ సహాయపడుతుందని ఆయనఅన్నారు. ఫేస్‌బుక్‌ యూజర్లలో 20 కోట్ల మంది అవివాహితులే ఉన్నారని, వీరికి కావాల్సిన డేటింగ్‌ సేవలను దగ్గర చేయాలని తెలిపారు. అయితే తాత్కాలిక సంబంధాలను కోరుకునే వారికి ఇది సరైన వేదిక కాదని స్పష్టం చేశారు. ఈ ఫీచర్‌లో భాగంగా యూజర్లు వేరుగా డేటింగ్‌ ప్రొఫెల్‌ను క్రియేట్‌ చేసుకోవాల్సి ఉంటుందని చెప్పారు. ప్రొఫెల్‌లోని మీ అభిరుచులకు సరిపోలే వ్యక్తులకు మాత్రమే మీ డేటింగ్‌ ప్రొఫెల్‌ కనిపిస్తుందని అన్నారు.

మరిన్ని వార్తలు