పరీక్షల ఒత్తిడిని తగ్గించే ఫేస్‌బుక్‌ లైకులు!

2 May, 2017 00:55 IST|Sakshi
పరీక్షల ఒత్తిడిని తగ్గించే ఫేస్‌బుక్‌ లైకులు!

వాషింగ్టన్‌: ఫేస్‌బుక్‌లో లైకులు, కామెంట్లు, మెసేజ్‌ల ద్వారా పరీక్షల ఒత్తిడి తగ్గే అవకాశముందని ఓ పరిశోధనలో తేలింది. గ్రాడ్యుయేట్‌ విద్యార్థుల్లో దీని ప్రభావంపై అమెరికాలోని ఇల్లినాయిస్‌ యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు పరిశోధన చేశారు.

తమకు మద్దతిస్తూ స్ఫూర్తినిచ్చే మెసేజ్‌లను చదవడం వల్ల వారిలో ఒత్తిడి 21 శాతం తగ్గిందని కనుగొన్నారు. వీరితో ఏడు నిమిషాల పాటు పరీక్ష రాయించగా వారు ఒత్తిడి లేకుండా స్వేచ్ఛగా పరీక్ష రాసారని శాస్త్రవేత్తలు తెలిపారు. మొత్తం విద్యార్థుల్లో 41 శాతం మంది పరీక్షలు రాసేటప్పుడు, సన్నద్ధమయ్యేటప్పుడు ఒత్తిడికి లోనవుతున్నారని, దీని కారణంగా వారి మార్కులు తగ్గిపోయి, ప్రదర్శన మందగిస్తోందన్నారు.

మరిన్ని వార్తలు